Telugu Global
Telangana

గులాబీ కండువా క‌ప్పుకున్న మ‌రి కొంతమంది మ‌హారాష్ట్ర నేత‌లు

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మోడల్ పాలన మహారాష్ట్రలో రావాలని కాంక్షిస్తూ తాము బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు నాయకులు తెలిపారు.

గులాబీ కండువా క‌ప్పుకున్న మ‌రి కొంతమంది మ‌హారాష్ట్ర నేత‌లు
X

మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా నుంచి ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేత‌లు శనివారం మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఎన్సీపీ మహారాష్ట్ర సోషల్ జస్టిస్ విభాగం ఉపాధ్యక్షులు సునీల్ దహెగావ్ కర్, చంద్రాపూర్ జిల్లా అధ్యక్షుడు ప్రియదర్శన్ అజయ్ ఇంగ్లే, ఎన్సీపీ చంద్రాపూర్ జిల్లా గూగూస్ సిటీ అధ్యక్షుడు దిలీప్ ఊషన్న పిట్టల్వార్, చంద్రాపూర్ జిల్లా నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి హేమంత్ సింగ్ గోవింద్ సింగ్ ఠాకూర్, జిల్లా ఉపాధ్యక్షులు నిఖిల్ జగదీష్ దుర్యోధన్, గూగూస్ సిటీ బీజేపీ మాజీ కౌన్సిలర్ మహేష్ లాట్, గూగూస్ సిటీ ఆప్ మాజీ అధ్యక్షుడు నవీన్ మోర్, గూగూస్ సిటీ బీజేవైఎం అధ్యక్షుడు శ్రీనివాస్ తాలపెల్లి, గూగూస్ సిటీ భీమ్ సేన యూత్ ప్రెసిడెంట్ సుశాంత్ వాగ్మర్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

మంత్రి హరీష్ రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ మోడల్ పాలన మహారాష్ట్రలో రావాలని కాంక్షిస్తూ తాము బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో గూగూస్ బీఆర్ఎస్ నాయకుడు తాండ్ర వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు.

First Published:  24 Jun 2023 11:26 AM GMT
Next Story