Telugu Global
Telangana

ఎల్‌వీ ప్ర‌సాద్ ఐ హాస్పిట‌ల్ ప్ర‌పంచ రికార్డు - ప‌రిశోధ‌న‌, ఉత్పాద‌న‌లో ప్ర‌పంచంలో 12వ స్థానం

కంటి చికిత్స‌లో ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టి, దేశ విదేశాల్లో పేరు ప్ర‌ఖ్యాతులు సాధించేలా ఎల్‌వీ ప్ర‌సాద్ యాజ‌మాన్యం, సిబ్బంది కృషి చేశారు. ప‌రిశోధ‌న‌, ఉత్పాద‌క‌త ఆధారంగా ప్ర‌పంచ ర్యాంకు సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ఎల్‌వీ ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రి యాజ‌మాన్యం సోమ‌వారం ప్ర‌క‌టించింది.

ఎల్‌వీ ప్ర‌సాద్ ఐ హాస్పిట‌ల్ ప్ర‌పంచ రికార్డు    - ప‌రిశోధ‌న‌, ఉత్పాద‌న‌లో ప్ర‌పంచంలో 12వ స్థానం
X

హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని ఎల్‌వీ ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రి అరుదైన ఘ‌న‌త సాధించింది. ప‌రిశోధ‌న‌, ఉత్పాద‌న‌, అత్యుత్త‌మ సేవ‌ల ఆధారంగా ఈ ఆస్ప‌త్రికి ప్ర‌పంచంలో 12వ స్థానం ల‌భించింది. కంటి చికిత్స‌లో ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టి, దేశ విదేశాల్లో పేరు ప్ర‌ఖ్యాతులు సాధించేలా ఎల్‌వీ ప్ర‌సాద్ యాజ‌మాన్యం, సిబ్బంది కృషి చేశారు. ప‌రిశోధ‌న‌, ఉత్పాద‌క‌త ఆధారంగా ప్ర‌పంచ ర్యాంకు సాధించ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ఎల్‌వీ ప్ర‌సాద్ కంటి ఆస్ప‌త్రి యాజ‌మాన్యం సోమ‌వారం ప్ర‌క‌టించింది.

కంటి సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు, కంటి వ్యాధులు, దృష్టికి ముప్పు క‌లిగించే అంశాల‌పై ఈ సంస్థ ప‌రిశోధ‌న‌లు చేప‌ట్టింది. వాటిలో అత్యుత్త‌మ ఫ‌లితాలు సాధించి ప్ర‌పంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో పాటు క్లినిక‌ల్‌ ప‌రిశోధ‌న‌, ఉత్పాద‌న‌, న‌యం చేయ‌లేని దృష్టి లోపం ఉన్న‌వారికి పున‌రావాసం వంటి సేవ‌ల‌పై దృష్టి కేంద్రీక‌రించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంటి సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించింది. 30 ఏళ్ల క్రితం చిన్న ఇన్‌స్టిట్యూట్‌గా ప్రారంభ‌మై.. నేడు ఇంత‌టి అంత‌ర్జాతీయ ఖ్యాతిని సొంతం చేసుకుంది.

First Published:  28 Feb 2023 8:43 AM GMT
Next Story