Telugu Global
Telangana

'మోడీని దించేద్దాం సింగరేణిని రక్షించుకుందాం' -సింగరేణి వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు

బారత రాష్ట్ర సమితి ఇచ్చిన నిరసన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక చోట్ల కార్మికులు మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. శ్రీరాంపూర్‌ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్‌ కాస్ట్‌లపై టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

మోడీని దించేద్దాం సింగరేణిని రక్షించుకుందాం -సింగరేణి వ్యాప్తంగా మిన్నంటిన నిరసనలు
X

సింగరేణి కార్మికులు మోడీ ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. సింగరేణి ప్రవేటీకరణ చేయబోతున్న కేంద్ర ప్రభుత్వం కుట్రలను నిరసిస్తూ ఈ రోజు సింగరేణి వ్యాప్తంగా కార్మికులు కదం తొక్కారు. రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెంలో బొగ్గు గనుల కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీలు నిర్వహించారు. మహా ధర్నాలు చేపట్టారు.

బారత రాష్ట్ర సమితి ఇచ్చిన నిరసన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక చోట్ల కార్మికులు మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. శ్రీరాంపూర్‌ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్‌ కాస్ట్‌లపై టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. గోదావరిఖనిలో టీబీజీకేఎస్‌ నేత కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు

రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఆందోళన కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ . కొత్తగూడెం బొగ్గు గనులలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామ నాగేశ్వరరావు , పెద్దపల్లి జిల్లాలోని బొగ్గు గనుల వద్ద నిర్వహించే మహా ధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకొండ చందర్ తో పాటు లార్మిక సంఘాల నేతలు పాల్గొంటున్నారు.

First Published:  8 April 2023 5:52 AM GMT
Next Story