Telugu Global
Telangana

రాజీనామా చేయ్‌.. ఇద్దరం పోటీ చేద్దాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్

ఒక్క సీటైనా గెలిచి చూపించాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని.. అందుకే ఇద్దరం కలిసి ఒకే సీటు కోసం పోటీ చేద్దామన్నారు కేటీఆర్.

రాజీనామా చేయ్‌.. ఇద్దరం పోటీ చేద్దాం - రేవంత్‌కు కేటీఆర్ సవాల్
X

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. ఇటీవల చేవెళ్లలో నిర్వహించిన జనజాతర బహిరంగసభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. తాజాగా కేటీఆర్ సైతం సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇద్దరం కలిసి మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానానికి పోటీ చేద్దామంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్.


ఒక్క సీటైనా గెలిచి చూపించాలని రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని.. అందుకే ఇద్దరం కలిసి ఒకే సీటు కోసం పోటీ చేద్దామన్నారు కేటీఆర్. తాను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. రేవంత్ కొడంగల్ ఎమ్మెల్యే, సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. సేఫ్‌ గేమ్‌ అక్కర్లేదన్నారు కేటీఆర్. రేవంత్ ఐడెంటిటి క్రైసిస్‌తో బాధపడుతున్నారంటూ సెటైర్లు వేశారు.

నేనే సీఎం, నేనే టీపీసీసీ అని రేవంత్ అరుస్తున్నారని, రేవంత్ నిజంగా మగాడైతే.. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ, మహిళలకు నెలకు రూ. 2500 ఆర్థిక సాయం, బీసీ ప్లాన్‌ అమలు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. రేవంత్‌ ఆత్మన్యూనత భావంలో ఉన్నాడన్నారు. పోటీకి ఆడవాళ్లయితే ఏంటి.. మగవాళ్లయితే ఏంటి అని ప్రశ్నించారు కేటీఆర్.

First Published:  29 Feb 2024 11:22 AM GMT
Next Story