Telugu Global
Telangana

'తెలంగాణలో మారుతున్న విద్యారంగాన్ని మీకు పరిచయం చేస్తాను'... వీడియో షేర్ చేసిన కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావ్‌పేట‌లోని కేజీ టు పీజీ క్యాంపస్ వీడియో షేర్ చేసిన కేటీఆర్ తెలంగాణ‌లో మారుతున్న విద్యా రంగాన్ని మీకు ప‌రిచయం చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. గంభీరావుపేటలో మోడల్ కేజీ టు పీజీ క్యాంపస్ మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటువంటి సౌకర్యాలను కల్పించడమే మా లక్ష్యం/కల అని తెలిపారు కేటీర్.

తెలంగాణలో మారుతున్న విద్యారంగాన్ని మీకు పరిచయం చేస్తాను... వీడియో షేర్ చేసిన కేటీఆర్
X

తెలంగాణ ప్రభుత్వం విద్యారంగం అభివృద్దికి చేస్తున్న కృషి గురించి ఈ రోజు రాష్ట్ర ఐటీ, పురపాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేశారు. కేజీ టూ పీజీ విద్య ఒకే క్యా‍ంపస్ లో ఉండేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఆ వీడియోలో కళ్ళకు కట్టాయి.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావ్‌పేట‌లోని కేజీ టు పీజీ క్యాంపస్ వీడియో షేర్ చేసిన కేటీఆర్ తెలంగాణ‌లో మారుతున్న విద్యా రంగాన్ని మీకు ప‌రిచయం చేస్తున్నాన‌ని పేర్కొన్నారు. గంభీరావుపేటలో మోడల్ కేజీ టు పీజీ క్యాంపస్ మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇటువంటి సౌకర్యాలను కల్పించడమే మా లక్ష్యం/కల అని తెలిపారు కేటీర్.

ఇంటర్నేషల్ స్కూల్స్ కు ధీటుగా ఉన్న ఆ స్కూల్ వీడియోను చూసిన నెటిజనులు తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

First Published:  24 Dec 2022 6:30 AM GMT
Next Story