Telugu Global
Telangana

లేక్ ఫ్రంట్ పార్క్ లో నేటినుంచి సందర్శకులకు ఎంట్రీ

100మంది లోపు సందర్శకులు పార్టీ చేసుకోడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. రూ.11వేలు చెల్లిస్తే పార్టీలకు అనుమతి ఇస్తారు. ఫంక్షన్ హాల్స్ తో పోల్చి చూస్తే ఇది చాలా చిన్నమొత్తం కావడంతో చిన్న చిన్న పార్టీలకు లేక్ ఫ్రంట్ పార్క్ కేరాఫ్ అడ్రస్ గా మారే అవకాశం ఉంది.

లేక్ ఫ్రంట్ పార్క్ లో నేటినుంచి సందర్శకులకు ఎంట్రీ
X

హుస్సేన్ సాగర్ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్న తెలంగాణ ప్రభుత్వం లేక్ ఫ్రంట్ పార్క్ ద్వారా ప్రజలకు మరింత ఉల్లాసాన్ని కలిగించే ఏర్పాటు చేసింది. హైదరాబాద్ లోని లేక్ ఫ్రంట్ పార్క్ ని గత మంగళవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంఛనంగా ప్రారంభించారు. అయితే గణేష్ నిమజ్జనం వల్ల కొన్నిరోజులపాటు పార్క్ ని మూసి ఉంచారు. ఈరోజు నుంచి సందర్శకులకు లేక్ ఫ్రంట్ పార్క్ అందుబాటులో ఉంటుంది.

టైమింగ్స్, ఎంట్రీ ఫీజు..

ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లేక్ ఫ్రంట్ పార్క్ ప్రజల సందర్శనార్థం తెరచి ఉంచుతారు. వివిధ స్టాల్స్, ఫుడ్ కోర్ట్ లు ఉదయం 9 నుంచి ప్రారంభం అవుతాయి. ఎంట్రీ ఫీజు పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.10 గా నిర్ణయించారు. వాకర్స్ కి ప్రత్యేక సదుపాయం ఉంది. ఉదయం 5 గంటలనుంచి 9 గంటల వరకు వాకర్స్ టైమ్ గా నిర్ణయించారు. పార్క్ లో వాకింగ్ కి రావాలంటే నెలకి రూ.100 చెల్లించి వాకర్స్ కార్డ్ తీసుకోవచ్చు.

పార్టీలు, ఫంక్షన్లు..

లేక్ ఫ్రంట్ పార్క్ లో బర్త్ డే పార్టీలు, కిట్టీపార్టీలు, గెట్ టు గెదర్ లకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు అధికారులు. 100మంది లోపు సందర్శకులు పార్టీ చేసుకోడానికి వీలుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. రూ.11వేలు చెల్లిస్తే పార్టీలకు అనుమతి ఇస్తారు. ఫంక్షన్ హాల్స్ తో పోల్చి చూస్తే ఇది చాలా చిన్నమొత్తం కావడంతో చిన్న చిన్న పార్టీలకు లేక్ ఫ్రంట్ పార్క్ కేరాఫ్ అడ్రస్ గా మారే అవకాశం ఉంది.

నేటినుంచి అనుమతి..

ఈరోజు ఆదివారం కావడంతో.. నేటి నుంచి లేక్ ఫ్రంట్ పార్క్ ని అధికారికంగా ఓపెన్ చేస్తున్నారు, సందర్శకులను అనుమతిస్తున్నారు. లేక్ ఫ్రంట్ పార్క్ కి ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి క్రేజ్ వచ్చింది. ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. హైదరాబాద్ వాసులు, వివిధ పనులకోసం నగరానికి వచ్చేవారు.. కచ్చితంగా లేక్ ఫ్రంట్ పార్క్ ని సందర్శిస్తారని చెప్పవచ్చు.

First Published:  1 Oct 2023 2:38 AM GMT
Next Story