Telugu Global
Telangana

హ్యాట్రిక్ ఖరారు.. ప్రతిపక్షాలు బేజారు - కేటీఆర్ ట్వీట్

తాజాగా మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షమేని.. రాబోయేది భారత రాష్ట్ర సమితేనంటూ ట్వీట్‌ చేశారు.

హ్యాట్రిక్ ఖరారు.. ప్రతిపక్షాలు బేజారు - కేటీఆర్ ట్వీట్
X


తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో ఇప్పటికే 115 స్థానాలను అభ్యర్థులను ప్రకటించి జోరు మీదుంది కారు పార్టీ. ఇక కేటీఆర్‌, హరీష్‌ రావులు సుడిగాలి పర్యటనలతో ఇప్పటికే ఓ విడత ప్రచారాన్ని పూర్తిచేశారు. అటు ప్రజాక్షేత్రంలో, ఇటు సోషల్‌మీడియాలో తమదైన శైలిలో సైటెర్లు, పంచ్‌లతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. తెలంగాణలో ఎన్నికలు ఏకపక్షమేని.. రాబోయేది భారత రాష్ట్ర సమితేనంటూ ట్వీట్‌ చేశారు. దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో గాంధీ సిద్ధాంతమే తప్ప గాడ్సే సిద్ధాంతం నడవదంటూ కేటీఆర్‌ చేసిన ట్వీట్ ఓ సారి చూద్దాం.


తెలంగాణలో ఎన్నిక ఏకపక్షమే..!

భారీ విజయం.. భారత రాష్ట్ర సమితిదే..!

రెండు సార్లు నిండుమనసుతో ప్రజాఆశీర్వాదం..!

మూడోసారి మనదే జయం..!

డిసెంబర్ మూడున వచ్చే ఫలితాల్లో

ముచ్చటగా మూడోసారి గెలిచేది

మనసున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారే..!

దక్షిణ భారతంలోనే సరికొత్త అధ్యాయం

దక్షత గల నాయకత్వానికే మరోసారి పట్టం..!

పదేండ్ల ప్రగతి మా పాశు పతాస్త్రం..!

విశ్వసనీయతే మా విజయ మంత్రం…!

జన నీరాజనంతో గులాబీదే ప్రభంజనం..!

ప్రతిఘాతుక ప్రతిపక్షాలకు తప్పదు మళ్లీ పరాభవం..!

మా కెప్టెన్ కేసీఆర్.. అందుకే మా టీంలో హుషారు

Hattrick విక్టరీ ఖరారు.. ప్రతిపక్షాలు బేజారు

మంచి చేసే బీఆర్ఎస్ పార్టీకే ప్రజల ఓటు

ముంచే పార్టీలపై తప్పదు వేటు

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ..

గులాబీ శ్రేణుల సమరోత్సహంతో

కదం తొక్కుతోంది తెలంగాణ నేల..!

ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు

గుండె గుండెలో ఎగురుతోంది మన గులాబీ జెండా..!

తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప

ఈ గడ్డపై గాడ్సే రాద్దాంతం నడవదు..!

మంచి చేసే బీఆర్ఎస్ పార్టీకే ప్రజల ఓటు

ముంచే పార్టీలపై తప్పదు వేటు

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ..

గులాబీ శ్రేణుల సమరోత్సహంతో

కదం తొక్కుతోంది తెలంగాణ నేల..!

ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు

గుండె గుండెలో ఎగురుతోంది మన గులాబీ జెండా..!

తెలంగాణలో గాంధీ సిద్ధాంతం తప్ప

ఈ గడ్డపై గాడ్సే రాద్దాంతం నడవదు..!

2014 లో తొలి అసెంబ్లీ ఎన్నికను నడిపించింది..

" ఉద్యమ చైతన్యం "

2018 లో రెండో ఎన్నికను గెలిపించింది..

"సంక్షేమ సంబురం"

2023 లో మూడో ఎన్నికను శాసించేది..

ముమ్మాటికీ... మన "పదేళ్ల సమగ్ర ప్రగతి ప్రస్థానం"

సమరానికి బీఆర్ఎస్ సర్వసన్నద్ధం

యుద్ధానికి ముందే కాంగ్రెస్ అస్త్రసన్యాసం

పోటీకి ముందే పూర్తిగా కాడి పడేసిన కమలం

బీఆర్ఎస్..

తన పాత రికార్డులు తిరగ రాయడం ఖాయం..!

ఈ సారి సెంచరీ కొట్టడం తథ్యం..!

బీఆర్ఎస్ తోనే తెలంగాణ చరిత

కేసిఆర్ గారితోనే తెలంగాణకు భవిత

అఖండ విజయం మనదే...

First Published:  9 Oct 2023 12:13 PM GMT
Next Story