Telugu Global
Telangana

తెలంగాణలో యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ.. గర్వంగా ఉందన్న కేటీఆర్

ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోవడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ మోజో ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు.

తెలంగాణలో యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ తయారీ.. గర్వంగా ఉందన్న కేటీఆర్
X

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌ సమీపంలో చైనా సంస్థ ఫాక్స్‌కాన్‌ వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటోంది. ఈ సంస్థ 550 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టింది. 2024 మే నాటికి ఫస్ట్ ఫేజ్‌ పూర్తి చేయాలని సంస్థ ప్రతినిధులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇక్కడ యాపిల్ ఎయిర్‌పాడ్స్‌ను తయారు చేయనున్నారు.


ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ వేగంగా నిర్మాణం పూర్తి చేసుకోవడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ మోజో ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమను తెలంగాణకు తీసుకువచ్చినందుకు చాలా గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు.

2022 మేలో ఫాక్స్‌కాన్ పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్, సంస్థ ప్రతినిధుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫేజ్‌-1 కింద 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

First Published:  6 Feb 2024 7:55 AM GMT
Next Story