Telugu Global
Telangana

కేటీఆర్ సుమతీ శతకం.. ఆయనను ఉద్దేశించేనా .?

ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే కేటీఆర్‌ ఈ పద్యాన్ని ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక మంచి ముహూర్తమున కుక్కను బంగారు సింహాసనంలో కూర్చుండబెట్టినప్పటికీ.. దాని నీచ స్వభావంను వదిలిపెట్టదనేది పద్యం భావం.

కేటీఆర్ సుమతీ శతకం.. ఆయనను ఉద్దేశించేనా .?
X

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునం.. అంటూ సుమతీ శతకాన్ని ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని పెద్దలు ఏనాడో చెప్పారన్నారు కేటీఆర్.


అయితే ఈ ట్వీట్‌ ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ఆసక్తిగా మారింది. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించే ఈ ట్వీట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం కాంగ్రెస్‌ బూత్‌ లీడర్స్‌ కన్వెన్షన్‌లో మాట్లాడిన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర పదజాలం వాడారు. కేసీఆర్ కొన ఊపిరితో ఉన్నాడని.. ఆయన పీక పిసికే బాధ్యత తమదేనంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఈ వ్యాఖ్యలను ఉద్దేశించే కేటీఆర్‌ ఈ పద్యాన్ని ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక మంచి ముహూర్తమున కుక్కను బంగారు సింహాసనంలో కూర్చుండబెట్టినప్పటికీ.. దాని నీచ స్వభావంను వదిలిపెట్టదనేది పద్యం భావం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటికీ.. ఆయన మాట తీరు, వ్యవహార శైలి మారలేదనేది కేటీఆర్ భావనగా తెలుస్తోంది.

First Published:  26 Jan 2024 4:28 AM GMT
Next Story