Telugu Global
Telangana

అప్పుడు అడుగడుగునా సంక్షోభం.. ఇప్పుడు గడప గడపకు సంక్షేమం

ఒక్క సంక్షేమ రంగానికే ప్రతి ఏటా 50 వేల కోట్లకు పైగా నిధులు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటేనని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశ సంక్షేమరంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయమిది అని అన్నారు.

అప్పుడు అడుగడుగునా సంక్షోభం.. ఇప్పుడు గడప గడపకు సంక్షేమం
X

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణలో సంక్షేమ సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలంగాణలో అందుతున్న సంక్షేమ ఫలాల గురించి వివరించారు. సమైక్యరాష్ట్రంలో అడుగడుగునా సంక్షోభం నెలకొంటే, తెలంగాణ ఏర్పాటయ్యాక గడప గడపకు సంక్షేమం వచ్చిందని చెప్పారు. ప్రతి కుటుంబంలో వెలకట్టలేని సంతోషం ఉందన్నారు. తెలంగాణ తొమ్మిదేళ్ల సంక్షేమ పథం, యావత్ దేశానికే సరికొత్త సందేశం ఇచ్చిందన్నారు కేటీఆర్. తెలంగాణలో నేడు సంక్షేమ పథకం అందని ఇల్లు లేదని, లబ్ధిదారుడు లేని కుటుంబం లేదని చెప్పారు.


కేంద్ర ప్రభుత్వ మోడల్ పేదలను ముంచడం, పెద్దలకు పంచడం అని.. తెలంగాణ సంక్షేమ మోడల్ సంపద పెంచడం, పేదలకు పంచడం అని వివరించారు కేటీఆర్. సంక్షేమం ప్రభుత్వానికి భారం కాదని, ప్రభుత్వ బాధ్యత అనేది సీఎం కేసీఆర్ ఆలోచన అని, దాన్ని అక్షరాలా ఆయన పాటించారని చెప్పారు. ప్రతి పథకంలో మానవీయ కోణం ఉందని, అందుకే సంక్షేమంలో స్వర్ణయుగం నడుస్తోందన్నారు. సంక్షేమ పథకాలతో ఆర్థిక సాయం అందిస్తూ.. పరోక్షంగా పేదల కొనుగోలు శక్తిని పెంచి, ఆత్మగౌరవంతో బతికే అవకాశమిచ్చిన ప్రభుత్వం తమది అని అన్నారు కేటీఆర్.

50వేల కోట్లు..

ఒక్క సంక్షేమ రంగానికే ప్రతి ఏటా 50 వేల కోట్లకు పైగా నిధులు ఇస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం ఒక్కటేనని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశ సంక్షేమరంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయమిది అని అన్నారు. ఆసరా, రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్, కళ్యాణలక్ష్మీ/షాదీ ముబారక్, దళిత బంధు, కంటివెలుగు, సన్నబియ్యం, గురుకులాలు, ఓవర్సీస్ స్కాలర్‌ షిప్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, బీసీలకు లక్ష వంటి పథకాలతో తమ ప్రభుత్వం పేదలకు అండగా నిలబడిందని చెప్పారు కేటీఆర్.

First Published:  9 Jun 2023 11:18 AM GMT
Next Story