Telugu Global
Telangana

ఆ యూట్యూబ్ ఛానెల్స్ ని నిషేధించాలి

వ్యక్తిగతంగా తనతోపాటు, తమ పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఈ ఫేక్ ప్రచారం జరుగుతోందని అన్నారు కేటీఆర్.

ఆ యూట్యూబ్ ఛానెల్స్ ని నిషేధించాలి
X

అసత్యాలు ప్రచారం చేస్తూ, అడ్డమైన థంబ్ నెయిల్స్ తో వార్తల పేరిట ఫేక్ న్యూస్ సృష్టిస్తున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు వేయబోతున్నట్టు చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయా యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామన్నారు. అలాంటి యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించాలని యూట్యూబ్ సంస్థకి అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటివి చేస్తున్నారని, ఇకనైనా ఇలాంటి తప్పుడు ప్రచారం ఆపాలని హితవు పలికారు కేటీఆర్.


ప్రధాన మీడియా కూడా రాజకీయ పార్టీలవారీగా విడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థులపై బురదజల్లే పని మొదలు పెట్టారు. తెలంగాణ ఎన్నికల సమయంలో యూట్యూబ్ ఛానెళ్లలో వచ్చే వార్తల్ని గ్రామీణ ప్రాంతాల ప్రజలు నమ్మారు. గతంలో కూడా పలు సందర్భాల్లో కేటీఆర్ ఈ తప్పుడు వార్తలపై సీరియస్ గా స్పందించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమపై అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారాయన. కేవలం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే ఈ వార్తలు వ్యాప్తి చేస్తున్నారని చెప్పారు కేటీఆర్.

వ్యక్తిగతంగా తనతోపాటు, తమ పార్టీని దెబ్బతీయాలనే కుట్రలో భాగంగానే ఈ ఫేక్ ప్రచారం జరుగుతోందని అన్నారు కేటీఆర్. గతంలో కూడా తమపై అసత్య ప్రచారాలు చేసిన మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు ప్రారంభించామని, ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ చేస్తున్న కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పారు. కుట్రపూరితంగా వ్యవహరించే యూట్యూబ్ ఛానెళ్ల నిర్వాహకులు చట్ట ప్రకారం తగిన శిక్షకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్.

First Published:  24 March 2024 1:18 PM GMT
Next Story