Telugu Global
Telangana

రాహుల్ జీ.. సీబీఐ ఎంక్వయిరీ కావాలా..?

'క్యా రాహుల్ జీ.. హో జాయే సీబీఐ ఎంక్వయిరీ?' అంటూ ట్వీట్ వేశారు కేటీఆర్. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టుగా అటు రేవంత్, ఇటు రాహుల్ కి కౌంటర్ ఇచ్చారు.

రాహుల్ జీ.. సీబీఐ ఎంక్వయిరీ కావాలా..?
X

వైరి వర్గాన్ని ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడంలో మంత్రి కేటీఆర్ ముందుంటారు. ఇటీవల ఓటుకు నోటు, సీటుకు నోటు అంటూ ఆయన రేవంత్ రెడ్డిని ఓ రేంజ్ లో కార్నర్ చేశారు. రేటెంత రెడ్డి అంటూ ఆయన పేరు కూడా మార్చేశారు. తాజాగా రాహుల్ గాంధీని ఇబ్బంది పెడుతూ మరో ట్వీట్ వేశారు కేటీఆర్. 'క్యా రాహుల్ జీ.. హో జాయే సీబీఐ ఎంక్వయిరీ?' అంటూ ట్వీట్ వేశారు. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్టుగా అటు రేవంత్, ఇటు రాహుల్ కి కౌంటర్ ఇచ్చారు.


2015 జూన్-9న ఓ ఇంగ్లిష్ న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తని తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు మంత్రి కేటీఆర్. అప్పట్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా సీక్రెట్ కెమెరాకు చిక్కారు. స్టీఫెన్ సన్ కు డబ్బులిచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సహకరించాలంటూ రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేసిన వీడియో అప్పట్లో సంచలనంగా మారింది. మనవాళ్లు బ్రీఫ్డ్ మి అంటూ చంద్రబాబు వాయిస్ కూడా పతాక శీర్షికలకు ఎక్కింది. అప్పుడు రేవంత్ రెడ్డి టీడీపీ నేత కాగా.. కాంగ్రెస్ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉంది. ఆ ఘటనపై కాంగ్రెస్ సీబీఐ ఎంక్వయిరీ కోరింది. ఇప్పుడు లెక్కలన్నీ మారిపోయి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆ కేసులో సీబీఐ ఎంక్వయిరీ కోరదామా అంటూ.. రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. పాత కేసుని మరోసారి ఆయన తెరపైకి తెచ్చారు.

ఇటీవల రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. అందులోనూ 3 గంటల కరెంట్ అంటూ.. రేవంత్ కూడా పదే పదే వైరి వర్గాలకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విషయంలో కూడా రేవంత్ రెడ్డిని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. టికెట్లు అమ్ముకున్నారని మండిపడుతున్నారు. ఈ క్రమంలో పాత ఓటుకు నోటు కేసు తెరపైకి తెచ్చి, అందులోనూ రాహుల్ గాంధీని ఇరుకున పెట్టేలా అప్పటి కాంగ్రెస్ డిమాండ్ ని మరోసారి గుర్తు చేసి రేవంత్ ని కార్నర్ చేశారు కేటీఆర్.

First Published:  29 Oct 2023 9:56 AM GMT
Next Story