Telugu Global
Telangana

నేడు కొత్తగూడ టూ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న కేటీఆర్

కొత్తగూడ నుంచి కొండాపూర్ జంక్షన్ మీదుగా బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు నిర్మించిన మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) మంత్రి కేటీఆర్ ఈ రోజు(ఆదివారం) ప్రారంభించనున్నారు.

నేడు కొత్తగూడ టూ బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్న కేటీఆర్
X

హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులుఖర్చు చేస్తోంది. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రవాణా సౌకర్యం అభివృద్ది చేయడం కోస‍ం మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పటికే నగరంలో అనేక ఫ్లై ఓవర్ లు నిర్మించిన ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన ఫ్లై ఓవర్ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేసింది.

కొత్తగూడ నుంచి కొండాపూర్ జంక్షన్ మీదుగా బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు నిర్మించిన మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ (MA&UD) మంత్రి కేటీఆర్ ఈ రోజు(ఆదివారం) ప్రారంభించనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డిపి) కింద ఈ ప్రాజెక్టును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) 263.09 కోట్ల రూపాయలతో నిర్మించింది.

ప్రధాన ఫ్లైఓవర్ ఎస్‌ఎల్‌ఎన్ టెర్మినస్ నుండి బొటానికల్ జంక్షన్ వరకు ఐదు లేన్‌లు, బొటానికల్ జంక్షన్ నుండి కొత్తగూడ జంక్షన్ వరకు ఆరు లేన్లు, కొత్తగూడ జంక్షన్ నుండి కొండాపూర్ ఆర్‌టిఓ కార్యాలయం వరకు మూడు లేన్‌లు ఉంటాయి. ప్రధాన ఫ్లైఓవర్ పొడవు 2,216 మీటర్లు.

బొటానికల్ గార్డెన్ వద్ద ఫ్లైఓవర్ పైకి రాంప్ రెండు లేన్లు, 401 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది మసీదు బండ రోడ్డు నుండి బొటానికల్ గార్డెన్ జంక్షన్ వరకు ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా చేస్తుంది. హైటెక్ సిటీ వైపు డౌన్ ర్యాంప్ మూడు లేన్లు కొత్తగూడ జంక్షన్ నుండి హైటెక్ సిటీ వైపు ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది.

ఈ మల్టీ లెవల్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్‌లో భాగంగా, హఫీజ్‌పేట నుండి గచ్చిబౌలి వరకు ట్రాఫిక్ కోసం కొత్తగూడ జంక్షన్‌లో మూడు లేన్ల, 470 మీటర్ల పొడవైన అండర్‌పాస్ కూడా నిర్మించారు.

మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌తో బొటానికల్ గార్డెన్ జంక్షన్, కొత్తగూడ జంక్షన్‌లలో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, కొండాపూర్ జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందని జీహెచ్‌ఎంసీ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది.

First Published:  1 Jan 2023 4:55 AM GMT
Next Story