Telugu Global
Telangana

బండి, ధర్మపురి, రాజాసింగ్‌ను ఓడించి చూపిస్తం- కేటీఆర్

బీజేపీ, కాంగ్రెస్‌ రెండు దోస్తులే అని, అందుకే గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్లలో కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. బీజేపీ ఓడిపోతుందంటే కాంగ్రెస్‌కు ఎందుకంత బాధని ప్రశ్నించారు కేటీఆర్‌.

బండి, ధర్మపురి, రాజాసింగ్‌ను ఓడించి చూపిస్తం- కేటీఆర్
X

బీజేపీకి రాష్ట్రంలో ఒక్క సీటు కూడా రాదన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈసారి కరీంనగర్‌లో బండి సంజయ్, గోషామహల్‌లో రాజాసింగ్, కోరుట్లలో ధర్మపురి అర్వింద్‌ను ఓడించబోతున్నామని ధీమా వ్య‌క్తం చేశారు. రాసిపెట్టుకోండి చెప్పి మరీ ఓడించబోతున్నామంటూ బీజేపీకి సవాల్‌ విసిరారు కేటీఆర్.

బీజేపీ, కాంగ్రెస్‌ రెండు దోస్తులే అని ఆరోపించారు. అందుకే గోషామహల్‌, కరీంనగర్‌, కోరుట్లలో కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థులను పెట్టిందన్నారు. బీజేపీ ఓడిపోతుందంటే కాంగ్రెస్‌కు ఎందుకంత బాధని ప్రశ్నించారు కేటీఆర్‌. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. ప్రధాని మోడీని ప్రశ్నించే దమ్ము రాహుల్‌గాంధీకి గానీ, రేవంత్‌ రెడ్డికి గానీ లేదన్నారు. మోడీని ఎదురించిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అన్నారు.

ఇంట గెలిచి రచ్చ గెలవాలని రాహుల్ గాంధీకి సూచించారు కేటీఆర్. యూపీలో ఎంపీ స్థానం గెలవని రాహుల్.. ఇవాళ తెలంగాణలో మమ్మల్ని ఓడగొడతామని చెప్పడం అవివేకమ‌న్నారు. రాహుల్‌ ఏనాడైనా బీజేపీకి పోటీ ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రతిచోట బీజేపీ ముందు తోకముడిచారన్నారు. ఇవాళ సౌత్‌ నుంచి మోడీని స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కుంటున్న ఏకైక వ్యక్తి కేసీఆర్‌ అన్నారు కేటీఆర్.

First Published:  26 Nov 2023 9:11 AM GMT
Next Story