Telugu Global
Telangana

రేవంత్‌ నిన్ను చరిత్ర క్షమించదు - కేటీఆర్‌ ఫైర్‌

తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమ నమూనా.. అభివృద్ధికి చిరునామా అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెడతావా అంటూ నిలదీశారు.

రేవంత్‌ నిన్ను చరిత్ర క్షమించదు - కేటీఆర్‌ ఫైర్‌
X

ఇటీవల ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి గుజరాత్‌ మోడల్‌ అంటూ చేసిన కామెంట్స్‌పై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రేవంత్‌కు తెలంగాణ ఆత్మ లేదని.. తెలంగాణ అంటే గౌరవం అంతకన్నా లేదన్నారు. ప్రధాని మోడీ సాక్షిగా తెలంగాణ ఆత్మగౌరవంపై రేవంత్ దాడి చేశారని ఆరోపించారు కేటీఆర్.

తెలంగాణ సోయి లేనోడు, ఆత్మగౌరవం విలువ తెలవనోడు సీఎంగా ఉండడం దౌర్భాగ్యమన్నారు కేటీఆర్. గోల్‌మాల్ గుజరాత్ మోడల్‌కు.. గోల్డెన్ తెలంగాణ మోడల్‌కు పోలికెక్కడిదని ప్రశ్నించారు కేటీఆర్. గంగా జమునా తెహజీబ్ మోడల్ కన్నా.. గోద్రా అల్లర్ల మోడల్ నచ్చిందా అంటూ రేవంత్‌పై ఫైర్ అయ్యారు కేటీఆర్.


తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమ నమూనా.. అభివృద్ధికి చిరునామా అంటూ చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టుపెడతావా అంటూ నిలదీశారు. నాడు ఉద్యమకారులపైకి రైఫిల్ ఎక్కుపెట్టాడని.. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవంపై దెబ్బకొట్టాడంటూ కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్‌ను చరిత్ర ఏనాటికి క్షమించదంటూ ట్వీట్ చేశారు.

First Published:  6 March 2024 2:44 PM GMT
Next Story