Telugu Global
Telangana

ద 'లై' లామా అండ్ హిజ్ డ్రామా

ఒకే నోటితో ఎన్ని మాటలు మారుస్తున్నారో చూడండి అంటూ రేవంత్ రెడ్డి వీడియోని రీట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ద 'లై' లామా అండ్ హిజ్ డ్రామా అంటూ తనదైన శైలిలో సెటైరిక్ కామెంట్ పెట్టారు.

ద లై లామా అండ్ హిజ్ డ్రామా
X

ఉచిత విద్యుత్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిని పూర్తిగా టార్గెట్ చేసింది బీఆర్ఎస్. ఇప్పటికే ఊరూవాడా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెట్టారు. అయితే తన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఎడిట్ చేశారని వివరణ ఇచ్చారు రేవంత్ రెడ్డి. దీంతో ఆయనపై మరింత ఫోకస్ పెరిగింది. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు ఆయన ఏమంటున్నారనే విషయాన్ని వెలికితీసి మరీ విమర్శలు ఎక్కుపెట్టాయి బీఆర్ఎస్ వర్గాలు.

ఇంతకీ రేవంత్ ఏమన్నారు..?

విభజన బిల్లులో విద్యుత్ పంపకాలు లేవని, చంద్రబాబు వల్లనే తెలంగాణకు అధిక విద్యుత్ కేటాయింపులు జరిగాయని గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు మళ్లీ తెరపైకి తెచ్చారు బీఆర్ఎస్ నేతలు. తాజాగా ఆయన.. విద్యుత్ కేటాయింపులకు సోనియాగాంధీ కారణం అని చెబుతున్నారు. ఇంతకీ విద్యుత్ కేటాయింపుల్లో తెలంగాణకు మేలు చేసింది ఎవరు? సోనియానా..? చంద్రబాబా..? రేవంత్ రెడ్డి ఎందుకిలా మాట మారుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అవి ఎవరో పంచి పెడితే రాలేదని, తెలంగాణ హక్కు అని అంటున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు.


ఒకే నోటితో ఎన్ని మాటలు మారుస్తున్నారో చూడండి అంటూ రేవంత్ రెడ్డి వీడియోని రీట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్. ద 'లై' లామా అండ్ హిజ్ డ్రామా అంటూ తనదైన శైలిలో సెటైరిక్ కామెంట్ పెట్టారు.

First Published:  14 July 2023 3:06 AM GMT
Next Story