Telugu Global
Telangana

కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు

హాస్టళ్లలో అధ్వాన్న పరిస్థితులపై ఇటీవల కాలంలో పదే పదే వార్తలు వినపడుతున్నాయి. ఈ ఉదాహరణలన్నిటినీ మరోసారి గుర్తు చేశారు కేటీఆర్.

కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో “మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అంటూ హస్తం పార్టీ నేతలు జోరుగా ప్రచారం చేశారు. మార్పు వస్తుంది సరే, అది ఎలాంటి మార్పు..? మంచిదా, చెడ్డదా..? అనేది మాత్రం వారు చెప్పలేదు. అయితే వారు అన్నట్టుగానే పెద్ద మార్పు తెచ్చారని.. బీఆర్ఎస్ పాలనలో సంతోషంగా ఉన్న తెలంగాణకు ఈ మార్పుతో కష్టాలు కొని తెచ్చారని ఎద్దేవా చేశారు కేటీఆర్. కాంగ్రెస్ మార్కు పాలనపై, కాంగ్రెస్ తీసుకొచ్చామంటున్న మార్పులపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఆనాటి కాంగ్రెస్ పాలనలో..

ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి..

పురుగుల అన్నం.. నీళ్ల చారు..

ఈనాటి కాంగ్రెస్ పాలనలో..

ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి..

బల్లిపడిన టిఫిన్లు – చిట్టెలుకలు తిరిగే చట్నీలు

మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో..

కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతం

నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడి..

20 మంది విద్యార్థులకు వాంతులు

సుల్తాన్ పూర్ జేఎన్టీయూ హాస్టల్ లో

చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలు

ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు ??

అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ ???

కలుషిత ఆహారం వల్ల...

పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆసుపత్రుల పాలవుతున్నారు

అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే..

విద్యార్థులకు ఈ అవస్థ...! ఈ అస్వస్థత...!!

ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి..

లేకపోతే..

భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదం

వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం.. అంటూ ట్వీట్ వేశారు కేటీఆర్.


కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ ముప్పేట దాడి చేస్తోంది. ఓవైపు కరెంటు కోతలు, రైతుల ఆత్మహత్యలు, మరోవైపు పోటీ పరీక్షల నోటిఫికేషన్లు, అభ్యర్థుల అవస్థలు, ఇంకో వైపు రాష్ట్రంలో పెరిగిపోతున్న హింసాత్మక ఘటనలు.. ఇలా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ ప్రతిపక్షం ప్రజా పోరాటాలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థలో లోపాలు, హాస్టళ్ల నిర్వహణలో లోటుపాట్లతో ప్రభుత్వమే ప్రతిపక్షానికి మరో అవకాశమిచ్చింది. హాస్టళ్లలో అధ్వాన్న పరిస్థితులపై ఇటీవల కాలంలో పదే పదే వార్తలు వినపడుతున్నాయి. ఈ ఉదాహరణలన్నిటినీ మరోసారి గుర్తు చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు ఎలాంటి అవస్థలు పడుతున్నారో విరించారు.

First Published:  10 July 2024 5:49 AM GMT
Next Story