Telugu Global
Telangana

తెలంగాణ కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండే.. రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు

నాలుగు నెలల క్రితం గుజరాత్ ను కించపరిచిన రేవంత్, మోదీ ముందు మాత్రం దేశానికి గుజరాత్ రోల్ మోడల్ అన్నారని సెటైర్లు పేల్చారు కేటీఆర్.

తెలంగాణ కాంగ్రెస్ లో ఏక్ నాథ్ షిండే.. రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు
X

సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే లాగా, అసోంలో హిమంత బిశ్వశర్మ లాగా.. తెలంగాణలో రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందన్నారు. బడే భాయ్.. చోటే భాయ్ సంబంధం ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని అన్నారు కేటీఆర్.


ప్రధానిగా మోదీకి బీఆర్ఎస్ కూడా ఎంతో గౌరవం ఇచ్చిందని చెప్పారు కేటీఆర్. అయితే తెలంగాణకు ఆయన ఏమీ చేయలేదని తెలిపారు. మోదీ తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ.. ఆయన కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని వివరించారు. భారత దేశంలో తెలంగాణ నెంబర్-1 గా ఉందని, దేశంలోనే అందరూ తెలంగాణ రాష్ట్రాన్ని అనుకరించేవారని అన్నారు. అయితే మోదీని బుట్టలో వేసుకోడానికే గుజరాత్ మోడల్ అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. నాలుగు నెలల క్రితం గుజరాత్ ను కించపరిచిన రేవంత్, మోదీ ముందు మాత్రం దేశానికి గుజరాత్ రోల్ మోడల్ అన్నారని సెటైర్లు పేల్చారు.

రేవంత్ రెడ్డి సర్కార్ పాల మీద పొంగు లాంటిదేనని చెప్పారు కేటీఆర్. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ ను 50 వేల మెజార్టీతో గెలిపించాలని కోరారు. సిరిసిల్ల రాబోతున్న రేవంత్ రెడ్డికి ఇక్కడి అభివృద్ధి చూసి పోవాలని సలహా ఇచ్చారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ముందు మూడు డిమాండ్లు ఉంచుతున్నట్టు తెలిపారు కేటీఆర్.

1. నేత కార్మికులకు క్షమాపణ చెప్పి బతుకమ్మ చీరల ఆర్డర్ వెంటనే ఇవ్వాలి.

2. వర్కర్ టు ఓనర్ పథకం వెంటనే అమలు చేయాలి.

3. ఇప్పటికే పూర్తయిన మల్కపేట రిజర్వాయర్ ని వెంటనే ప్రారంభించాలి.

తమ డిమాండ్లను పరిష్కరిస్తామని సిరిసిల్ల పర్యటనలో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వాలన్నారు కేటీఆర్.

First Published:  5 March 2024 4:44 PM GMT
Next Story