Telugu Global
Telangana

ఆయన సోషల్ మీడియా సూపర్ స్టార్.. కేటీఆర్ సెటైర్

కేఏ పాల్ సోషల్ మీడియా సూపర్ స్టార్ అని అన్నారు మంత్రి కేటీఆర్. ఆయన ఇంటర్వ్యూలకు ఇప్పుడు కూడా బాగా రేటింగ్ ఉంటుందని, ఆ వీడియోలు చూస్తే ఇప్పటికీ నవ్వుకుంటామన్నారు.

ఆయన సోషల్ మీడియా సూపర్ స్టార్.. కేటీఆర్ సెటైర్
X

తెలంగాణ ఎన్నికల వేళ ప్రచారంలో హడావిడిగా ఉన్న మంత్రి కేటీఆర్ ఓ ఇంటర్వ్యూలో సరదాగా మాట్లాడారు. ఇటీవల కాలంలో తాను పడీ పడీ నవ్వుకున్న ఘటన ఒకటుందని చెప్పారు. అమెరికాలో తన కొడుకుని వదిలి పెట్టి వచ్చే సమయంలో అందరూ బాధలో ఉన్నప్పుడు ఓ వీడియో చూశామని, అది చూసి పడీ పడీ నవ్వుకున్నామని చెప్పారు కేటీఆర్. అది కేఏపాల్ ఇంటర్వ్యూ అని అన్నారు. పాల్ గురించి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


ఆయన సోషల్ మీడియా సూపర్ స్టార్..

కేఏ పాల్ సోషల్ మీడియా సూపర్ స్టార్ అని అన్నారు మంత్రి కేటీఆర్. ఆయన ఇంటర్వ్యూలకు ఇప్పుడు కూడా బాగా రేటింగ్ ఉంటుందని, ఆ వీడియోలు చూస్తే ఇప్పటికీ నవ్వుకుంటామన్నారు. ఇటీవల తానే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రినంటూ కేఏపాల్ చెప్పుకుంటున్నారని సెటైర్లు పేల్చారు.

88 సీట్లు గ్యారెంటీ..

తెలంగాణలో 88సీట్లకంటే ఎక్కువ మెజార్టీతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. కేసీఆర్ కంటే మెరుగైన నాయకుడెవరూ లేరన్నారు. కొన్ని కొన్ని సర్వేల్లో అక్కడ ఉన్నదొకటి, బయటకు వచ్చేది ఒకటి అన్నట్టుగా పరిస్థితి ఉందని, తమకు సైలెంట్ మెజార్టీ వస్తుందన్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే గెలుపు ఓటములకు సిద్ధపడి ఉండాలన్నారు. నమ్మకం లేదు కాబట్టి కిషన్ రెడ్డి ఎన్నికల్లో పోటీయే చేయట్లేదన్నారు. అధికారంలోకి వస్తామని షర్మిల, కేఏపాల్ కూడా అనుకుంటున్నారని, కానీ అది అందరికీ సాధ్యమయ్యేది కాదన్నారు. కేసీఆర్ కి ప్రత్యామ్నాయం ఎవరూ లేరన్నారు కేటీఆర్.

First Published:  15 Nov 2023 4:34 AM GMT
Next Story