Telugu Global
Telangana

గ్రేటర్‌లో 8 రోజులు కేటీఆర్‌ రోడ్‌ షో

గ్రేటర్‌లో రోడ్ షోలతో కేటీఆర్‌ హోరెత్తిస్తే.. అధినేత కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. 25న హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ పాల్గొంటారు.

గ్రేటర్‌లో 8 రోజులు కేటీఆర్‌ రోడ్‌ షో
X

తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో అధికార బీఆర్‌ఎస్ ప్రచారంపై దృష్టి సారించింది. గ్రేటర్‌లో మరోసారి సత్తా చాటేందుకు రంగంలోకి దిగుతున్నారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకు 8 రోజుల పాటు గ్రేటర్ హైదరాబాద్‌లో రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. 8 రోజుల్లో రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున 15 నియోజకవర్గాల్ని చుట్టేయబోతున్నారు.

కేటీఆర్ రోడ్‌ షో షెడ్యూల్..

15 - కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి

16 - అంబర్‌పేట, ముషీరాబాద్

17 - గోషామహల్‌, సికింద్రాబాద్‌

18 - జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌

19 - సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌

20 - ఎల్బీ నగర్‌

21 - శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌

22 - మల్కాజ్‌గిరి, ఉప్పల్‌

25 - సీఎం కేసీఆర్ బహిరంగ సభ

గ్రేటర్‌లో రోడ్ షోలతో కేటీఆర్‌ హోరెత్తిస్తే.. అధినేత కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు. 25న హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ పాల్గొంటారు. సభా ప్రాంగణం ఎక్కడా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

First Published:  13 Nov 2023 7:58 AM GMT
Next Story