Telugu Global
Telangana

వరల్డ్ టాప్ 30 ఇన్‌ఫ్లూయన్సర్స్‌ లిస్ట్‌లో కేటీఆర్‌

'కే కోర్ ఎనలటిక్స్' ప్రకటించిన ఈ జాబితాలో ఉన్న వరల్డ్ టాప్ 30 ఇన్‌ఫ్లూయన్సర్స్‌ లిస్ట్‌లో మన దేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు మంత్రి కేటీఆర్‌ కాగా, మరొకరు ఎంపీ రాఘవ్ చద్దా.

వరల్డ్ టాప్ 30 ఇన్‌ఫ్లూయన్సర్స్‌ లిస్ట్‌లో కేటీఆర్‌
X

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో 30 మంది టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు చోటు లభించింది.

'కే కోర్ ఎనలటిక్స్' ప్రకటించిన ఈ జాబితాలో ఉన్న వరల్డ్ టాప్ 30 ఇన్‌ఫ్లూయన్సర్స్‌ లిస్ట్‌లో మన దేశం నుంచి ఇద్దరు యువ నేతలకు మాత్రమే చోటు దక్కడం విశేషం. అందులో ఒకరు మంత్రి కేటీఆర్‌ కాగా, మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా.

ఈ లిస్ట్ లో గ్రెటా థన్‌బెర్గ్, యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడర్ వెనెస్సా నకేట్, పర్యావరణ, ఇండీజీనియస్ ఉద్యమకారురాలు హెలెనా గువాలింగ, వాలా అఫ్షర్, జిమ్ హారిస్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వంటి ప్రముఖ పేర్లు కూడా ఉన్నాయి. కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్, @KTRTRS, అధికారిక హ్యాండిల్, @MinisterKTR, రెండూ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

ఈ జాబితాలో కేటీఆర్ వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్ @KTRTR 12వ స్థానం సంపాదించగా, అధికారిక హ్యాండిల్, @MinisterKTR 22వ స్థానాన్ని దక్కించుకుంది. రాఘవ చద్దా 23వ స్థానం దక్కించుకున్నారు.

కాగా, కేటీఆర్ ట్విట్టర్ లో చాలా చురుకుగా ఉంటారు. ట్విట్టర్ ద్వారా ఎవరు ఏ సమస్యను ఆయన దృష్టికి తెచ్చినా వెంటనే ఆయన స్పందించి దాన్ని పరిష్కరిస్తారు. అంతే కాకుండా రాజకీయ విషయాల్లో కూడా ఆయన ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో 'కే కోర్ ఎనలటిక్స్' ప్రకటించిన ప్రపంచవ్యాప్త 30 మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్‌ లిస్టులో కేటీఆర్ 12 వ స్థానం సాధించడం పట్ల సర్వత్రా హర్షం వ్యకమవుతోంది.

First Published:  17 Jan 2023 12:16 PM GMT
Next Story