Telugu Global
Telangana

పదేళ్ల నిజం, పదేళ్ల విషం, వందరోజుల అబద్ధం మధ్య పోటీ

ఉంటే బీజేపీలో ఉండు, లేదంటే జైలులో ఉండు.. అన్నట్టుగా ప్రధాని మోదీ తీరు ఉందని మండిపడ్డారు కేటీఆర్.

పదేళ్ల నిజం, పదేళ్ల విషం, వందరోజుల అబద్ధం మధ్య పోటీ
X

పదేళ్ల నిజం, పదేళ్ల విషం, వందరోజుల అబద్ధం మధ్య జరుగుతున్న పోటీగా తెలంగాణ లోక్ సభ ఎన్నికలను పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇక్కడ పదేళ్ల నిజం బీఆర్ఎస్ అని, పదేళ్ల విషం బీజేపీ అని, వందరోజుల అబద్ధం కాంగ్రెస్ పాలన అని వివరణ ఇచ్చారు. పదేళ్లలో తెలంగాణలో నిజమైన అభివృద్ధిని చూపించిన బీఆర్ఎస్ కే ప్రజలు మద్దతు తెలుపుతారని అన్నారు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన పొరపాటుని, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు సరిదిద్దుకోబోతున్నారని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయిన వారు ఆ పార్టీకే ఓటు వేయాలని, కాని వాళ్లు బీఆర్ఎస్ కి ఓటు వేయాలని పిలుపునిచ్చారు కేటీఆర్.


రాష్ట్రంలో కరువు వస్తే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా రైతుల దగ్గరికి పోలేదని, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకే అపాయింట్ మెంట్ లెటర్లు ఇస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వంపై యువకులు, రైతులు, మహిళలు.. అందరూ కోపంతో ఉన్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే యూట్యూబ్ లో మొరిగే కుక్కల దాకా.. అందరికీ సమాధానం చెప్పాలన్నారు కేటీఆర్. గంటకి 100 కిలో మీటర్ల స్పీడ్ తో కారు ఉరకాలని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలని ఆకాంక్షించారు.

ఈటల రాజేందర్ ఇంకా బీఆర్ఎస్ లో ఉన్నట్టు మాట్లాడుతున్నారని, అసలు మల్కాజ్ గిరికి మోదీ ఏం చేశారో ఆయన చెప్పాలని నిలదీశారు కేటీఆర్. ఐదేళ్లు కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, రాష్ట్రంలో కరోనా సమయంలో కుర్ కురేలు పంచిపెట్టారని, రైల్వే స్టేషన్లలో లిఫ్టులు ప్రారంభించారని, ఆఖరికి సింటెక్స్ ట్యాంక్ ల ప్రారంభోత్సవాలకు కూడా ఆయన హాజరయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు కిషన్ రెడ్డి ఏం తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉంటే బీజేపీలో ఉండు, లేదంటే జైలులో ఉండు.. అన్నట్టుగా ప్రధాని మోదీ తీరు ఉందని మండిపడ్డారు కేటీఆర్.

First Published:  27 March 2024 10:02 AM GMT
Next Story