Telugu Global
Telangana

త్రిబుల్ ఐటీ విద్యార్థుల్లో భరోసా నింపిన కేటీఆర్

బాసరలోని త్రిబుల్ ఐటీ విద్యార్థుల్లో మంత్రి కేటీఆర్ భరోసా నింపారు. కేటీఆర్ పర్యటన తర్వాత తమ సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయనే నమ్మకంతో త్రిబుల్ ఐటీ విద్యార్థులున్నారు.

త్రిబుల్ ఐటీ విద్యార్థుల్లో భరోసా నింపిన కేటీఆర్
X

మంత్రి కేటీఆర్ బాసర లోని RGUKT (Rajeev Gandhi University of Knowledge Technologies) ని విజిట్ చేయబోతున్నాడు అన్న సమాచారం తెలిసినప్పటి నుండి తమ సమస్యల పరిష్కారానికై ఆందోళనలు చేపడుతున్న బాసర విద్యార్థులతో కేటీఆర్ ఏం మాట్లాడ బోతున్నారు, కేటీఆర్ ను విద్యార్థులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే ఉత్కంఠ.

యూనివర్సిటీ లోకి అడుగుపెట్టగానే కేటీఆర్ కు విద్యార్థులు ఇచ్చిన అపూర్వ స్వాగతం, మధ్యాహ్న భోజనం సమయంలో మంత్రి విద్యార్థుల మధ్య జరిగిన ఆప్యాయ సంభాషణలు ఉత్కంఠ స్థానే ఉత్సాహాన్ని నింపాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... విద్యార్థులనుద్దేశించి కేటీఆర్ మాట్లాడిన 46 నిమిషాల ప్రసంగం విద్యార్థులను కట్టిపడేసింది.

బాసర RGUKT లో మంత్రి కేటీఆర్ మాట్లాడింది మామూలు విద్యార్థులతో కాదు... SSC లో తమ తమ మండలాల్లో టాపర్లుగా నిలిచి రాష్ట్రం అన్ని జిల్లాల నుండి బాసరకు వచ్చిన సూపర్ షార్ప్ విద్యార్థులు వీళ్లు. మంత్రి మాట్లాడుతున్నంత సేపు శ్రద్దగా విన్నారు.

ప్రతీ ఇంట్లో ఏవో గొడవలూ, అలకలూ ఉండటం సహజం అని చెప్తూ ప్రభుత్వం విద్యార్థులను కన్నబిడ్డల్లాగా చూసుకుంటుంది అని మంత్రి విద్యార్థులకు తెలియచేశారు. సమస్యల పరిష్కారానికి విద్యార్థులు ఎంచుకున్న పద్ధతి, వారి పోరాట స్ఫూర్తిని కేటీఆర్ ప్రశంసించారు.

తన కోర్ టీమ్ లో ఇద్దరు ప్రత్యేకంగా బాసర ట్రిపుల్ ఐటీ లోని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నారని కేటీఆర్ ప్రసంగంలో చెప్పినప్పుడు గత కొన్ని నెలలుగా క్యాంపస్ లో జరుగుతున్న పాజిటివ్ మార్పుల వెనుక ఎవరున్నారు అన్న సంగతి విద్యార్థులకు అర్థం అయ్యింది. .

మంచి విద్యావేత్త మాత్రమే కాకుండా, పరిపాలనా అనుభవం ఉన్న వ్యక్తిని, సమస్యల పరిష్కారం పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించే వ్యక్తిని ఇంఛార్జి వీసీగా నియమించడం లాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల క్యాంపస్ లో వస్తున్న మార్పులు విద్యార్థులు గమనిస్తున్నారు.

భవిష్యత్ లో బాసర ట్రిపుల్ ఐటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని, టీ హబ్ సెంటర్, మినీ స్టేడియం, డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు.

బాగా చదివి జాబులు తెచ్చు కోవడమే కాదు... జాబులు ఇచ్చే స్థాయికి ఎదగాలి అంటూ కేటీఆర్ చెప్పిన మాటల్లో తెలంగాణ బిడ్డలు ఎదగాలన్న కోరిక కనిపించింది.

బాసర ట్రిపుల్ ఐటీ ని ఆదర్శ క్యాంపస్ గా తీర్చి దిద్దాలంటే ప్రభుత్వం ఏం చెయ్యాలి, విద్యార్థులు ఏం చెయ్యాలో ఆయన చెప్పిన సజెషన్స్ లో సమస్యలు లేని క్యాంపస్ కావాలన్న నిజాయితీ ఉంది.

ప్రతీరోజూ భోజనం ఈ రోజు లాగే ఉండాలని.... నవంబర్ లో మళ్లీ వస్తాను.. అప్పటివరకు అన్నీ బాగుండాలని వీసీ ని, అధికారులని ఆదేశించారు.

సమస్యను రాజకీయం చేసి, స్వలాభం కోసం వాడుకోవాలని చూసే కొంతమంది రాజకీయ నాయకులలాగా కాకుండా...సమస్య పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పాటుపడుతున్న కేటీఆర్ లాంటి నాయకుడి బాసర క్యాంపస్ సందర్శన సూపర్ సక్సెస్ అయ్యింది.

First Published:  27 Sep 2022 1:30 PM GMT
Next Story