Telugu Global
Telangana

ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన - కేటీఆర్

జీతం ఇవ్వడం లేదని అడిగితే ఉద్యోగం నుంచి పీకేశారు, ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్.

ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన - కేటీఆర్
X

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. తొలిరోజు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి సైతం పాల్గొన్నారు. మిగిలిన రోజుల్లో మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని ప్రభుత్వం చెప్పడంతో పెద్ద సంఖ్యలో జనం తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి క్యూ కట్టారు.


తాజాగా నాచారం ESI హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రేణుకా అనే మహిళ.. సెక్యూరిటీ ఏజెన్సీ తమ జీతంలో భారీగా కోత పెడుతోందని, రూ.15 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 10 వేలు మాత్రమే ఇస్తున్నారని ప్రజావాణిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, అధికారుల నుంచి స్పందన లేకపోగా.. ఫిర్యాదు చేశారన్న కారణంతో రేణుకను ఉద్యోగం నుంచి తొలగించారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. జీతం ఇవ్వడం లేదని అడిగితే ఉద్యోగం నుంచి పీకేశారు, ఇది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్. ఆర్బాటం ఎక్కువ, పరిష్కారం తక్కువ అంటూ సెటైర్ వేశారు. రేణుకను ఉద్యోగంలో నుంచి తీసివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌ను డిమాండ్ చేశారు. ఇప్పటివరకూ ప్రజాదర్బార్‌ వల్ల ఎన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు కేటీఆర్.

First Published:  28 Aug 2024 5:29 AM GMT
Next Story