Telugu Global
Telangana

ఈటల రాజేందర్ పై కేటీఆర్ ఫైర్

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో జరిగిన బీఆరెస్ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ, ఈటల ఎన్నికల్లో గెలిచి 14 నెలలయ్యింది. ఈ 14 నెలల్లో హుజూరాబాద్ కు ఏంచేశారు ? కేంద్రం ప్రభుత్వం ద్వారా రూ.3వేల పెన్షన్‌ ఇస్తామన్నారు. నిధుల వరద పారిస్తామని చెప్పారు. ఢిల్లీ నుంచి ఒక్క పైసా అయినా తీసుకవచ్చారా ? తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులనే కేంద్రం ఇవ్వడం లేదని కేటీఆర్ మండిపడ్డారు.

ఈటల రాజేందర్ పై కేటీఆర్ ఫైర్
X

హుజూరాబాద్ ఉప ఎనికలకు ముందు అమిత్‌షాను తీసుకువస్తా.. నిధుల వరద పారిస్తా, హుజూరాబాద్‌ను మార్చేస్తా అన్నారు. బండి సంజయ్ , తాను కలిసి హుజూరాబాద్ ను స్వర్గం చేస్తామన్నారు. ఏమైంది ? హుజూరాబాద్ కు ఏం చేశారు అని కేటీఆర్ ప్రశ్నించారు.

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో జరిగిన బీఆరెస్ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ, ఈటల ఎన్నికల్లో గెలిచి 14 నెలలయ్యింది. ఈ 14 నెలల్లో హుజూరాబాద్ కు ఏంచేశారు ? కేంద్రం ప్రభుత్వం ద్వారా రూ.3వేల పెన్షన్‌ ఇస్తామన్నారు. నిధుల వరద పారిస్తామని చెప్పారు. ఢిల్లీ నుంచి ఒక్క పైసా అయినా తీసుకవచ్చారా ? తెలంగాణకు న్యాయంగా రావాల్సిన నిధులనే కేంద్రం ఇవ్వడం లేదని కేటీఆర్ మండిపడ్డారు.

కేసీఆర్ పాలన‌ రాష్ట్రానికి అరిష్టం అని ఈటల మాట్లాడుతున్నాడు. దీన్నే తల్లిపాలు తాగి రొమ్ముగుద్దడం అంటారు. అసలు ఎవరికీ తెలియని ఈటలను హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలకు పరిచయం చేసిందెవరు ? 33 మంది హుజూరాబాద్ టికట్ కోసం ప్రయత్నం చేస్తే అందరినీ కాదని ఈటలకు టికట్ ఇచ్చింది ఎవరు ? కేసీఆర్ కాదా ? రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని, తండ్రిలాంటి వ్యక్తిని పట్టుకొని అరిష్టమని మాట్లాడటం ఈటలకు తగునా అని కేటీఆర్ ప్రశ్నించారు.

అసలు అరిష్టమెవరు? ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ? గెలిస్తే ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామన్నారు.హుజూరాబాద్ లో ఎవరికైనా ఆ డబ్బులు వచ్చాయా ? దేశంలోని అందరి డబ్బులు అదానీ ఖాతాలో పడ్డాయి. ఆయన‌ పంచ కుబేరుడైపోయాడు. దొంగ, మంది సొమ్ము తిని ఆయన‌ ఒక్కడే బాగుపడ్డాడు. అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

First Published:  31 Jan 2023 3:17 PM GMT
Next Story