Telugu Global
Telangana

సీఎం కేసీఆర్ అనుమతితో.. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న మంత్రి కేటీఆర్

జపాన్ ప్రతినిధుల సమావేశాన్ని రద్దు చేసుకోవడం భావ్యం కాదని భావించిన మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది.

సీఎం కేసీఆర్ అనుమతితో.. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న మంత్రి కేటీఆర్
X

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయాన్ని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12.37 గంటలకు జెండా ఆవిష్కరణతో పాటు సర్దార్ పటేల్ రోడ్‌లోని తాత్కాలిక కార్యాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ దూరమయ్యారు. బీఆర్ఎస్ ఢిల్లీలో నిర్వహిస్తున్న ఈ ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకాకపోవడానికి హైదరాబాద్‌లో జరుగనున్న కీలక పెట్టుబడి సమావేశాలు కారణం.

ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రిగా చాలా బిజీగా ఉండే కేటీఆర్ షెడ్యూల్ చాలా ముందుగానే ఫిక్స్ అవుతాయి. జపాన్‌కు చెందిన సుజుకి సంస్థ అంతర్జాతీయ విభాగాల అధుపతులతో సమావేశం చాన్నాళ్ల క్రితమే నిర్ణయించబడింది. ఆ కంపెనీ ప్రతినిధులు కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. సమయపాలన, షెడ్యూల్స్ విషయంలో చాలా కచ్చితంగా ఉండే జపాన్ ప్రతినిధుల సమావేశాన్ని రద్దు చేసుకోవడం భావ్యం కాదని భావించిన మంత్రి కేటీఆర్.. సీఎం కేసీఆర్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే తన ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తున్నది.

జపాన్‌కు చెందిన సుజుకీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తిగా ఉన్నది. ఈ రోజు ఆ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించిన విస్తృత సమావేశం జరుగనున్నది. అలాగే ఉదయం హైటెక్ సిటీలోని సలార్పురియా నాలెడ్జ్ పార్కులో బాష్ (BOSCH) ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం కూడా ఉన్నది. ఈ రెండు కీలక కార్యక్రమాల కారణంగా కేటీఆర్ ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.

First Published:  14 Dec 2022 4:40 AM GMT
Next Story