Telugu Global
Telangana

భైంసాలో రాయితో దాడి.. కేటీఆర్ రియాక్షన్ ఏంటంటే!

ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా నిర్మల్ జిల్లా భైంసాలో రోడ్‌ షో నిర్వహించారు కేటీఆర్. రోడ్‌ షో ప్రారంభ సమయంలో కొందరు హనుమాన్ భక్తులు అక్కడికి వచ్చి రోడ్‌ షోను అడ్డుకున్నారు.

భైంసాలో రాయితో దాడి.. కేటీఆర్ రియాక్షన్ ఏంటంటే!
X

భైంసా రోడ్‌ షోలో తనపై రాయి విసరడంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాళ్ల దాడిలో తనకు ఎలాంటి గాయం కాలేదని ట్వీట్ చేశారు. తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానన్న కేటీఆర్.. మతం పేరుతో విషం చిమ్మడం, ద్వేషాన్ని వ్యాప్తి చేసే దుండగులతో తన పోరాటం కొనసాగిస్తూనే ఉంటానన్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..!

గురువారం సాయంత్రం ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కుకు మద్దతుగా నిర్మల్ జిల్లా భైంసాలో రోడ్‌ షో నిర్వహించారు కేటీఆర్. రోడ్‌ షో ప్రారంభ సమయంలో కొందరు హనుమాన్ భక్తులు అక్కడికి వచ్చి రోడ్‌ షోను అడ్డుకున్నారు. గతంలో కేటీఆర్ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది. భైంసా సున్నితమైన ప్రాంతం కావడంతో కొద్దిసేపు కేటీఆర్‌ రోడ్‌షోను పోలీసులు నిలిపివేశారు.


తర్వాత యధావిధిగా కేటీఆర్ రోడ్‌ షో ప్రారంభం కాగా.. హనుమాన్ మాల వేసుకున్న ముసుగులో కొందరు ఆకతాయిలు కేటీఆర్‌ టార్గెట్‌గా రాళ్లతో పాటు టమాటోలు, ఉల్లిగడ్డలు విసిరారు. కేటీఆర్‌ పక్కనున్న వారు వాటిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఓ వైపు వారు నిరసన తెలియజేస్తున్నప్పటికీ.. కేటీఆర్ వెనక్కి తగ్గలేదు. తన ప్రసంగాన్ని కొనసాగించారు.

First Published:  10 May 2024 4:01 AM GMT
Next Story