Telugu Global
Telangana

నేను చేయాలనుకున్న పనులు ఇవే- కేటీఆర్‌

ఈ సమాధానంపై చాలా మంది స్పందించారు. ఈ మూడింటిలో అర్బన్‌ ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్ డ్రైనేజ్‌ సిస్టమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

నేను చేయాలనుకున్న పనులు ఇవే- కేటీఆర్‌
X

సోషల్‌మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే రాజ‌కీయ నాయ‌కుల్లో కేటీఆర్ ఒకరు. నెటిజన్లకు సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కేటీఆర్. సమస్యలపై స్పందిస్తూ పరిష్కారం చూపిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ నెటిజన్ గత పదేళ్లలో చేయాలనుకుని.. చేయలేకపోయిన టాప్-3 పనులేంటని కేటీఆర్‌ను ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు స్పందించిన కేటీఆర్.. ఏమని సమాధానమిచ్చారంటే..!

1. మూసీ నది సుందరీకరణ

2. అర్బన్ ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌ అండ్ డ్రైనేజ్‌ సిస్టమ్ ఇంప్రూమ్‌మెంట్‌

3. వచ్చే పదేళ్లలో 415 కిలోమీటర్ల వరకు మెట్రో కనెక్టివిటీని పెంచడం. రాబోయే 5 ఏళ్లలో కనీసం 215 కి.మీటర్ల వరకు మెట్రో కనెక్టివిటీని పెంచడం అని తన లక్ష్యాలను వివరించారు కేటీఆర్.


ఈ సమాధానంపై చాలా మంది స్పందించారు. ఈ మూడింటిలో అర్బన్‌ ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్ డ్రైనేజ్‌ సిస్టమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఇక ప్రచార సభలు, రోడ్ షోలతో బిజిబిజీగా గడుపుతున్న కేటీఆర్‌.. సోషల్‌మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గత తొమ్మిదన్నరేళ్ల పాలనలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

First Published:  19 Nov 2023 2:43 AM GMT
Next Story