Telugu Global
Telangana

బండి, ఈటల, సోయం, రఘునందన్‌ల‌ను ఓడించిందెవరు..?

ఈటల రాజేంద‌ర్, బండి సంజయ్, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపూరావును ఓడించిందెవరు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. "బీజేపీ లీడర్లు అందరినీ ఓడించింది బీఆర్ఎస్ మాత్రమే.

బండి, ఈటల, సోయం, రఘునందన్‌ల‌ను ఓడించిందెవరు..?
X

బీజేపీని అడ్డుకునే ద‌మ్ము బీఆర్ఎస్‌కు మాత్రమే ఉంద‌న్నారు ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2014, 2019 ఎన్నిక‌ల్లో కూడా బీజేపీని అడ్డుకుంది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు. మల్కాజ్‌గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు.

బీజేపీని ఓడించే దమ్ము బీఆర్ఎస్‌కే ఉంది..

ఈటల రాజేంద‌ర్, బండి సంజయ్, రఘునందన్ రావు, అర్వింద్, సోయం బాపూరావును ఓడించిందెవరు..? అని కేటీఆర్ ప్రశ్నించారు. "బీజేపీ లీడర్లు అందరినీ ఓడించింది బీఆర్ఎస్ మాత్రమే. బీజేపీని ఓడించే దమ్ములేకనే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేస్తున్నాడు. బీజేపీని ఓడించే దమ్ములేని కాంగ్రెస్‌ను న‌మ్మి ఓటును వృథా చేయొద్దు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అని ప్రచారం చేస్తున్నారు. నిజంగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైతే కేసీఆర్ కూతురు జైల్లో ఉండేదా? తప్పుడు ప్రచారాలను మైనార్టీలు నమ్మొద్దు" అన్నారు కేటీఆర్.


మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే..

కేసీఆర్ అంటే పదేళ్ల అభివృద్ధి.. రేవంత్ రెడ్డి అంటే వంద రోజుల అబద్ధం అన్నారు కేటీఆర్. "మరోసారి కాంగ్రెస్‌కు ఓటేస్తే మొత్తం పథకాలను రేవంత్ రెడ్డి బంద్ పెడతాడు. ఏమీ చేయకపోయినా సరే ఓట్లు వేశారంటూ అన్ని పథకాలను ఆపేస్తాడు. కాంగ్రెస్ చెప్పిన అన్ని పథకాలు అమలు కావాలంటే బీఆర్ఎస్‌ను గెలిపించాలి. మ‌ల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో వ‌ల‌స పక్షుల‌కు ఓట్లువేస్తే గెలిచిన త‌ర్వాత మీకు క‌న‌బ‌డ‌రు. కాబ‌ట్టి ఆలోచించి ఓటేయాలి" అన్నారు కేటీఆర్.

మల్కాజ్‌గిరికి రేవంత్ ఏం చేశాడు..?

"గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీతోనే గెలిచారు. రేవంత్ రెడ్డికి మల్కాజ్‌గిరి ఎంతో ఇచ్చింది. పీసీసీ, సీఎం పదవులు రావటానికి మల్కాజ్‌గిరి ప్రజలే కారణం. అలాంటి రేవంత్ రెడ్డి ఇక్కడి ప్రజలకు ఏం చేయ‌లేదు. పార్లమెంట్‌లో పత్తా లేకుండా పోయాడు. ప్రజలకు కష్టం వస్తే కనబడకుండా పోయాడు. ఈ వలస పక్షులకు ఓట్లు వేస్తే గెలిచిన తర్వాత మీకు కనబడరు. మీకు 24 గంటలు అందుబాటులో ఉండే రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించండి" అని ప్రజ‌ల‌ను కేటీఆర్ కోరారు.

First Published:  24 April 2024 11:27 AM GMT
Next Story