Telugu Global
Telangana

కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు

మంత్రి నాపై చేసిన ఆరోపణలకు ఆధారాలుంటే సీబీఐ విచారణకు ఇవ్వాలని ఆర్‌ఎస్పీ డిమాండ్‌

కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు
X

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టారని ఆపార్టీ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.రాబోయే యాభై ఏండ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉండాలో ఒక స్పష్టమైన ఆలోచనతో శిథిలమవుతున్న ఈ తరాన్ని కాపాడుకోవడం కోసం కేటీఆర్ గా గురుకులాల బాట అనే పిలుపు ఇచ్చారు. విద్యా శాఖ మంత్రి అయిన రేవంత్ కి గురుకులాల పట్ల అవగాహన లేక, మతిస్థిమితం లేని కొందరు మంత్రులతో రకరకాల వేదికల మీద మాట్లాడిస్తున్నాడు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్‌కు భయం పుట్టింది. మంత్రి కొండా సురేఖ శుక్రవారం నాపై ఆరోపణలు చేశారు. నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని చెప్పారు. నా ఫ్యామిలీని వదిలపెట్టి రెండు లక్షల మంది విద్యార్థుల కోసం తొమ్మిదేళ్ల పాటు కష్టపడ్డాను.అందుకే ఈరోజు అద్భుత ఫలితాలు వస్తున్నాయన్నారు. 300 గురకుల పాఠశాలలను 1000పైగా చేసిన ఘనత కేసీఆర్‌ ఘనతేనన్నారు. ఇవాళ 75 గురుకుల డిగ్రీ కాలేజీలున్నాయి. ఇదంతా కేసీఆర్‌ దార్శనికత వల్లనే సాధ్యమైందన్నారు. మీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నడైనా దీని గురించి ఆలోచించిందా కొండా సురేఖ అని ప్రశ్నించారు. కొండా సురేఖ ఫ్యామిలీ గురించి, వారి కుటుంబం చేసిన ఆకృత్యాల గురించి వరంగల్‌ ప్రజలకు తెలుసన్నారు. జమ్ముకశ్మీర్‌ డీజీపీగా ఉన్న నలిన్‌ ప్రభాత్‌ మీ కుటుంబానికి వరంగల్‌ చౌరస్తాలో కౌన్సిలింగ్‌ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు.రోజూ బీర్లు, బిర్యానీలు, రేవ్ పార్టీల గురించి వీడియోలు చేసే కొండా సురేఖకి.. ఆకలితో అలమటిస్తూ, విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతున్న పేద గురుకుల విద్యార్థుల బాధలు అర్థం అవుతాయా? ఆర్‌ఎస్‌పీ ఫైర్‌ అయ్యారు.సంవత్సరం నుండి తెలంగాణలో విద్యా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లేరు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు చనిపోతున్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యావ్యవస్థ కుప్పకూలిందని అన్నారు. కేసీఆర్ హయాంలో గురుకుల విద్యావ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. గురుకుల విద్యార్థులు రోడ్ ఎక్కుతున్నారు. ఒకే జిల్లాలో మూడు సార్లు గురుకుల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారని అన్నారు. మహిళలపై ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పింది. ఆమెకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదన్నారు. గతంలో ఐపీఎస్‌ అధికారిగా ఉన్న నాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ఏడేళ్ల సర్వీస్‌ను వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. నాపై ఆరోపణలు ఉంటే బైటపెట్టాలని ఆర్‌ఎస్పీ సవాల్‌ విసిరారు. వాటికి ఆధారాలు ఉంటే సీబీఐ విచారణకు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

First Published:  30 Nov 2024 1:05 PM IST
Next Story