Telugu Global
Telangana

అవును, అమ్ముడుపోయా.. అయితే ఏంటి..?

ఆ కవరింగ్ చెదిరింది, రాజగోపాల్ రెడ్డి రేటెంతో తెలిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ మొదటి నుంచీ చేస్తున్న విమర్శలు నిజమేనని ఆయనే ఒప్పుకున్నారు.

అవును, అమ్ముడుపోయా.. అయితే ఏంటి..?
X


నిస్సిగ్గుగా నిజం ఒప్పుకున్నారు, నిర్లజ్జగా చేసిన తప్పుని బయట పెట్టుకున్నారు. అవును, మునుగోడు బీజేపీ అభ్యర్థి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కాంట్రాక్ట్ వర్క్ కి అమ్ముడుపోయానని టీవీ డిబేట్ లో ఒప్పేసుకున్నారు. ఓ ప్రశ్నకు సమాధానం చెబుతూ, అనుకోకుండా ఆయన నోటినుంచి నిజం బయటపడింది. ఆ తర్వాత కవర్ చేసుకునే ఛాన్స్ లేకుండా పోయింది.

18వేలకోట్లకు అమ్ముడుపోయా..!

రాజగోపాల్ రెడ్డి కేవలం కాంట్రాక్ట్ వర్క్ ల కోసమే బీజేపీలో చేరారనేది బహిరంగ రహస్యం. కానీ ఆయన నియోజకవర్గ అభివృద్ధి అంటూ కవర్ చేసుకోవాలని చూస్తుంటారు. ఆ కవరింగ్ చెదిరింది, రాజగోపాల్ రెడ్డి రేటెంతో తెలిసింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ మొదటి నుంచీ చేస్తున్న విమర్శలు నిజమేనని ఆయనే ఒప్పుకున్నారు. తనకు ఆరు నెలల క్రితం 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ వర్క్ లు వచ్చాయని చెప్పారు రాజగోపాల్ రెడ్డి.

మూడేళ్లనుంచి ట్రై చేశా...

మూడేళ్లనుంచి తాను బీజేపీలో చేరేందుకు ట్రై చేస్తున్నానని, కానీ తనకు ఆరు నెలల క్రితమే ఆ కాంట్రాక్ట్ వర్క్ వచ్చిందని, దానికి దీనికి సంబంధం లేదని చెప్పుకోవాలని చూశారు రాజగోపాల్ రెడ్డి. కానీ అక్కడే నిజం బయటపడిపోయింది. 6 నెలల క్రితం కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది కాబట్టే.. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీలో చేరేందుకు కూడా కాస్త టైమ్ తీసుకున్నట్టు భలే డ్రామా నడిపారు. ఆ తర్వాత కాషాయ కండువా కప్పుకున్నారు. అంటే మునుగోడు నియోజకవర్గ ప్రజల్ని 18వేల కోట్లకు ఆయన అమ్మేశారనమాట. ఈ డీల్ లో అసలు ప్లస్ లాభం రాజగోపాల్ రెడ్డి జేబులోకి వెళ్లింది. ఆ కోట్ల రూపాయల వర్కులో కొంత ఖర్చుపెట్టి మళ్లీ ఎమ్మెల్యేగా గెలవొచ్చు అని ఆశపడుతున్నారు రాజగోపాల్ రెడ్డి.

ఇప్పుడుంటుంది అసలు మజా..

ఇన్నాళ్లూ 18వేల కోట్ల కాంట్రాక్ట్ వర్క్ అనేది కేవలం ఆరోపణ మాత్రమే. ఇప్పుడది అక్షర సత్యం. రాజగోపాల్ రెడ్డి తనకు తానే ఒప్పుకున్న నిజం. ఎక్కడా మాట ఎడిటింగ్ కాలేదు, వాక్యం తప్పుగా ధ్వనించలేదు. నా వ్యాఖ్యలు వక్రీకరించారని చెప్పుకునే ఛాన్సే లేదు. నేను ఆ మాట అనలేదు అని చెప్పడానికి అస్సలు అవకాశం లేదు. అడ్డంగా బుక్కయ్యారు రాజగోపాల్ రెడ్డి. రేపు ప్రచారంలో ప్రజలకు ఏమని చెబుతారు. అవును, అమ్ముడుపోయా, అందులో కొంత మీకు పంచిపెడతా, నాకు ఓటు వేయండి అని చెప్పినా చెప్పొచ్చు. ఇదీ రాజగోపాల్ రెడ్డి రాజకీయం. కాదు కాదు, రాజకీయ వ్యాపారం. బీజేపీ చేసిన రాజకీయ వ్యభిచారం.

First Published:  7 Oct 2022 3:27 PM GMT
Next Story