Telugu Global
Telangana

బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో కోమటిరెడ్డికి నో ఛాన్స్‌.. అదే కారణమా..?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడుతో పాటు ఎల్బీనగర్ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి తన భార్య కోమటిరెడ్డి లక్ష్మీని బరిలో దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ ఫస్ట్‌ లిస్ట్‌లో కోమటిరెడ్డికి నో ఛాన్స్‌.. అదే కారణమా..?
X

బీజేపీ ఎట్టకేలకు 52 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లిస్ట్‌లో సీనియర్ లీడర్‌ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చోటు దక్కలేదు. కోమటిరెడ్డికి చోటు దక్కకపోవడం వెనుక ఆయన రెండు సీట్లు అడగడమే కారణంగా తెలుస్తోంది.

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడుతో పాటు ఎల్బీనగర్ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మునుగోడు అసెంబ్లీ స్థానం నుంచి తన భార్య కోమటిరెడ్డి లక్ష్మీని బరిలో దింపాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇక తాను ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.

మరోవైపు మునుగోడు సీటును కాంగ్రెస్‌ సీపీఐకి ఇస్తే అక్కడి నుంచి పోటీ చేయాలని రాజగోపాల్ రెడ్డి యోచిస్తున్నారట. సీపీఐకి ఇవ్వకుండా కాంగ్రెస్‌ అభ్యర్థి బరిలో ఉంటే తను ఎల్బీ నగర్‌ నుంచి పోటీ చేయాలనేది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్లాన్‌గా తెలుస్తోంది. ప్రస్తుతానికి బీజేపీ ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు.


First Published:  22 Oct 2023 2:48 PM GMT
Next Story