Telugu Global
Telangana

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు 65 స్థానాలు గెలుచుకోగా.. బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. ఇక MIM 7 స్థానాలను నిలబెట్టుకోగా.. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 8 స్థానాల్లో విజయం సాధించింది.

బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు ఫోన్‌ చేసి కాంగ్రెస్‌లోకి వస్తామంటున్నారని చెప్పారు. అయితే దీనిపై అధిష్టానం, పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌ రెడ్డిలతో చర్చించాకే ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవ‌డంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తాము తలుచుకుంటే తెల్లారేసరికి బీఆర్ఎస్‌లో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావు తప్పితే మరో ఎమ్మెల్యే ఉండరంటూ కామెంట్స్ చేశారు కోమటిరెడ్డి.

ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఈ వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి. బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలున్నారని.. బీజేపీ 8, MIM 7 కలుపుకుంటే ఆ సంఖ్య 54కు చేరుతుందన్నారు కడియం. ఏడాదిలో అంతా తారుమారవుతుందని, సింహం మళ్లీ బయటకు వస్తుందంటూ కడియం కామెంట్స్ చేశారు. మళ్లీ ఏడాదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందనేలా కడియం చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు 65 స్థానాలు గెలుచుకోగా.. బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. ఇక MIM 7 స్థానాలను నిలబెట్టుకోగా.. బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 8 స్థానాల్లో విజయం సాధించింది.

First Published:  7 Dec 2023 2:50 PM GMT
Next Story