Telugu Global
Telangana

కోమటి రెడ్డి తన‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు -మాణిక్ రావు ఠాక్రే

రాష్ట్ర‍లో ఏ పార్టీకి మెజార్టీ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, పార్టీల మధ్య పొత్తు తప్పదని కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు ఉపాధ్యక్షులు అసంత్రుప్తి వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడిన ఠాక్రే, కోమటి రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని, ఇక ఈ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు.

కోమటి రెడ్డి తన‌ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు -మాణిక్ రావు ఠాక్రే
X

కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారని ఏఐసీసీ తెలంగాణ ఇంచార్గ్ మాణిక్ రావు ఠాక్రే తెలిపారు. ఆయన ఈ రోజు గాంధీ భవన్ లో పీసీసీ ఉపాధ్యక్షుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమటి రెడ్డి పార్టీ లైన్ లోనే ఉన్నారని చెప్పారు.

అయితే రాష్ట్ర‍లో ఏ పార్టీకి మెజార్టీ రాదని, హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని, పార్టీల మధ్య పొత్తు తప్పదని కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలువురు ఉపాధ్యక్షులు అసంత్రుప్తి వ్యక్తం చేశారు. దీనిపై మాట్లాడిన ఠాక్రే, కోమటి రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని, ఇక ఈ విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందని తెలిపారు.

కాగా, మొత్తం 34 మంది పీసీసీ ఉపాధ్యక్షులు ఉండగా 9 మంది మాత్రమే సమావేశానికి హాజరవడం పట్ల ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు హాజరుకానివారంతా వివరణ ఇవ్వాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఎల్లుండి మరోమారు సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు.

మరో వైపు , అసలు ఠాక్రే తన వ్యాఖ్యలపై వివరణ అడగనే లేదని కోమటి రెడ్డి వెంకట రెడ్డి మీడియాతో అన్నారు. ఠాక్రే ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని ఆయన చెప్పారు. తన వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించాయన్న విషయం ఆయనకు తెలుసునని కోమటి రెడ్డి తెలిపారు.

First Published:  15 Feb 2023 2:52 PM GMT
Next Story