Telugu Global
Telangana

బీజేపీలో చేరేందుకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏం ముట్టిందో తెలుసా ?

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డిని బీజేపీలో చేర్చుకోవడానికి ఆయనకు ఆ పార్టీ భారీ నజరానానే ఇచ్చింది. జార్ఖండ్ లో అతి పెద్ద బొగ్గు గనిని 25 ఏళ్ళపాటు ఆయనకు లీజుకిచ్చేశారు.

బీజేపీలో చేరేందుకు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఏం ముట్టిందో తెలుసా ?
X

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. చాలా కాలంగా ఆయన స్వంత పార్టీ మీద, పీసీసీ అధ్యక్షుడి మీద విమర్శ‌లు ఎక్కుపెడుతున్నారు. పైగా తాను బీజేపీలో చేరబోతున్నట్టు బహిరంగంగానే చెప్తున్నారు. టీఆరెస్ ను ఓడించాలంటే బీజేపీ కే సాధ్యమని, కాంగ్రెస్ పార్టీతో అది సాధ్యం కాదని అందుకే తాను బీజేపీలోకి వెళ్ళబోతున్నట్టు ప్రకటించేశారు రాజగోపాల్ రెడ్డి.

అంతే కాదు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళ నాయకత్వంలో పని చేయడం పట్ల కూడా అయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆయన బీజేపిలో చేరడానికి చెప్తున్న కారణాలు నిజమైనవేనా ? అంతకు మించి మరేవైనా కారణాలున్నాయా ?

కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనేక వ్యాపారాలున్నాయని అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాల కన్నా వ్యాపారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మొన్నీ మధ్య ఆయన బీజేపీ అగ్రనేత అమిత్ షాను కలుసుకున్నప్పుడు కూడా తన వ్యాపార భాగస్వామి బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేతో కలిసే వెళ్ళారు.

వ్యాపారానికి అంత ప్రాధాన్యత ఇచ్చే రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరబోవడం వెనక రాజకీయ కారణాలకన్నా కూడా వ్యాపార కారణాలే ప్రధానమంటున్నారు.

ఆయనకీమధ్య జార్ఖండ్ లో ఓ బొగ్గు గని 25 సంవత్సరాలకు గానూ లీజుకు దక్కింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ కు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన సంస్థలకు మధ్య ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరింది. జార్ఖండ్ లోని హజారీబాగ్ జిల్లాలో1495 హెక్టార్ల విస్తీర్ణంలో అంటే 3737 ఎకరాలు ఉన్న ఈ బొగ్గు గని ఈయనకు చెందిన కంపెనీలకు 25 సంవత్సరాల లీజుకిచ్చారు. ఈ మెగా ప్రాజెక్ట్ లో సంవత్సరానికి 15 మెగా టన్నుల బొగ్గు లభిస్తుంది.

ఈ ప్రాజెక్టు పబ్లిక్, ప్రైవేటు మోడ్ లో నడుస్తుంది. సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టుకోసం

సుషీ చంద్రగుప్త్ కోల్ మైన్ ప్రైవేట్ లిమిటెడ్, సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్, MRKR కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ తో ఒప్పందం చేసుకుంది. ఈ అన్ని కంపెనీలలో రాజగోపాల్ రెడ్డి కుమారుడు, బంధువులు డైరెక్టర్లుగా ఉన్నారు.

సుషీ చంద్రగుప్త్ కోల్ మైన్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్లుగా మేడ మధుసూద‌న్ రెడ్డి, అడ్ల జైపాల్ రెడ్డి, కోమటి రెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు. సంకీర్త్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డికి కుమారుడు. ఈ సంస్థ ఈ ఏడాది ఫిబ్రవరి 8వ తేదీన స్థాపించారు. అంటే కోల్ ఇండియా తో ఒప్పందానికన్నా ఒక నెల ముందు.

M R K R కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్లుగా మేడ మధుసూధన్ రెడ్డి, మేడ సుచరిత, మేడ వెంకటరామి రెడ్డి, మేడ రామకృష్ణా రెడ్డి, వంటిమిట్ట నర్సింహా రెడ్డి లు ఉన్నారు. ఈ సంస్థ 2006 ఏప్రెల్ లో స్థాపించారు.

ఇక సుషీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ లో డైరెక్టర్లుగా అడ్ల జైపాల్ రెడ్డి, రాధికా పున్నం, సదాశివ రెడ్డి దేవి రెడ్డి, కోమటి రెడ్డి సంకీర్త్ రెడ్డి ఉన్నారు. ఈ సంస్థ 1986 డిశంబర్ 30 వ తేదీన స్థాపించారు.

ఇక ఈ ప్రాజెక్ట్ మొత్తం మూలధన వ్యయం 3437 కోట్ల రూపాయలు. ప్రతి సంవత్సరం 15 మెగా టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. ఒక్కో టన్నుకు ప్రస్తుతమున్న రేటు ప్రకారం... అది కూడా అదానీ దగ్గర మోదీ కొనాలని రాష్ట్రాలకు సూచించిన రేటు ప్రకారం 8 వేల రూపాయలు. దీన్ని బట్టి ఒక్క మెగా టన్నుకు అంటే 10 లక్షల టన్నులకు ఎంత వస్తుంది ? 15 మెగా టన్నులకు సంవత్సరానికి ఎంత వస్తుంది ? 25 ఏళ్ళకు ఎంత వస్తుంది ? మీరే లెక్కలేసుకోండి. కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి బీజేపీలోకి ఎ౦దుకు వెళ్తున్నాడో మీరే ఊహించుకోండి.




First Published:  27 July 2022 10:40 AM GMT
Next Story