Telugu Global
Telangana

జిల్లాల అధ్యక్షులు 12 మందిపై వేటు.. ఎందుకంటే..?

అధ్యక్షుల మార్పుపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు కిషన్‌రెడ్డి తన టీమ్‌ను సిద్ధం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది.

జిల్లాల అధ్యక్షులు 12 మందిపై వేటు.. ఎందుకంటే..?
X

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాల‌ అధ్యక్షులు 12 మందిపై వేటు వేసింది. వారి స్థానంలో కొత్త అధ్యక్షులను నియమించింది. అలాగే, బీజేపీ మోర్చాలకు సైతం కొత్త అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షులకు.. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.

12 జిల్లాల కొత్త అధ్యక్షులు వీళ్లే:

పెద్దపల్లి - చందుపట్ల సునీల్

నిజామాబాద్ - దినేష్ కుమార్

వరంగల్ - గంట రవి

ములుగు - బలరాం

మహబూబ్ నగర్ -శ్రీనివాస్ రెడ్డి

నారాయణపేట - జలంధర్ రెడ్డి.

వనపర్తి - నారాయణ

నల్గొండ - డాక్టర్ వర్షిత్ రెడ్డి

యాదాద్రి - పాశం భాస్కర్

సిద్దిపేట - మోహన్ రెడ్డి

సంగారెడ్డి - గోదావరి అంజిరెడ్డి

వికారాబాద్ - మాధవరెడ్డి

మోర్చాల కొత్త అధ్యక్షులు వీళ్లే:

ఎస్సీ మోర్చా - కొండేటి శ్రీధర్

ఎస్టీ మోర్చా - కల్యాణ్ నాయక్

ఓబీసీ మోర్చా - ఆనంద్ గౌడ్

కిసాన్ మోర్చా - పెద్దోళ్ల గంగారెడ్డి

యువ మోర్చా - మహేందర్

మహిళా మోర్చా - డాక్టర్ శిల్ప

అధ్యక్షుల మార్పుపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు కిషన్‌రెడ్డి తన టీమ్‌ను సిద్ధం చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో పార్టీ కోసం సరిగ్గా పనిచేయకుండా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినవాళ్లపైనే ఈ వేటు పడిందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. దీర్ఘకాలికంగా అధ్యక్షులుగా ఉండటం కూడా మార్పున‌కు కారణంగా చెబుతున్నారు.

First Published:  19 Jan 2024 1:40 AM GMT
Next Story