Telugu Global
Telangana

పోటీ టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యే.. మళ్లీ బుక్కైన కిషన్ రెడ్డి..

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యేనని చెప్పారు. అంటే ఆయన ముందే బీజేపీ ఓటమిని ఒప్పుకున్నారనమాట.

పోటీ టీఆర్ఎస్ – కాంగ్రెస్ మధ్యే.. మళ్లీ బుక్కైన కిషన్ రెడ్డి..
X

మునుగోడు ఉప ఎన్నికలో పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాత్రమే. మూడో స్థానం కోసమే బీజేపీ పోటీ పడుతోంది. మొదటినుంచీ టీఆర్ఎస్ నేతలు చెబుతోంది ఇదే. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఇన్నాళ్లూ ఈ విషయంలో విభేదిస్తూ మునుగోడులో గెలుపు తమదేనంటూ చంకలు గుద్దుకుంటున్న బీజేపీ.. ఇప్పుడా విషయాన్ని ఒప్పేసుకుంది. మునుగోడులో పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యేనంటూ తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి మునుగోడు ఉప ఎన్నికలో పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యేనని చెప్పారు. అంటే ఒకరకంగా ఆయన ముందే ఓటమిని ఒప్పుకున్నారనమాట. పొరపాటున టంగ్ స్లిప్ అయ్యారని అనుకున్నా.. అదే నిజమవుతుందని టీఆర్ఎస్ నుంచి ఆల్రడీ సెటైర్లు మొదలయ్యాయి. మునుగోడులో బీజేపీకి మూడో స్థానమే దిక్కని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. సోషల్ మీడియాలో కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ట్రోల్ చేస్తున్నారు.

సైంటిస్ట్ మోదీ..

ఆమధ్య ప్రధాని నరేంద్ర మోదీని కూడా సైంటిస్ట్ ని చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన కరోనా వ్యాక్సిన్ కనిపెట్టారని చెప్పారు. ఆ ముచ్చటకు కూడా మునుగోడు ప్రచారమే వేదిక కావడం గమనార్హం. ప్రధాని మోదీ, కరోనా వ్యాక్సిన్ కనిపెట్టి భారత దేశాన్ని కాపాడారని, అందుకే ఆయనకు అందరూ కృతజ్ఞతతో ఉండాలని, మునుగోడులో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. అప్పట్లో మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలకు ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. మోదీకి వైద్య శాస్త్రంలో నోబెల్ ఇవ్వాలన్నారు. ఆ తర్వాత నోబెల్ కంటే ఆస్కార్ ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు కేటీఆర్. అప్పట్లో నోరుజారి మోదీని నవ్వులపాలు చేసిన కిషన్ రెడ్డి, ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో పోటీ టీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యేనంటూ చెప్పి పార్టీ పరువు తీశారు.

First Published:  19 Oct 2022 3:29 PM GMT
Next Story