Telugu Global
Telangana

చెప్పుకోడానికేం లేదు.. అందుకే సుష్మా స్వరాజ్ పేరు తెరపైకి

దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న వేళ.. తాము వెనకబడిపోతామనే ఉద్దేశంతో గోల్కొండ కోటలోలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు కిషన్ రెడ్డి.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

తెలంగాణ సాధన గురించి కానీ, దశాబ్ది ఉత్సవాల గురించి కానీ చెప్పుకోవాలంటే కచ్చితంగా సీఎం కేసీఆర్ ప్రస్తావన రావాలి, బీఆర్ఎస్ ఉద్యమం గురించి చర్చించుకోవాలి. కానీ బీజేపీకి ఇవి ఇష్టం లేవు, అలాగని దశాబ్ది ఉత్సవాలకు దూరంగా ఉండలేదు. అందుకే గోల్కొండ కోటలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగరేసి మమ అనిపించారు. అయితే అక్కడ తెలంగాణ ఏర్పాటులో బీజేపీ భాగస్వామ్యం గురించి చెప్పుకోడానికేమీ లేకపోవడంతో ఆయన సుష్మా స్వరాజ్ పేరు తెరపైకి తెచ్చారు. పార్లమెంట్ లో తెలంగాణ కోసం సుష్మా స్వరాజ్ పోరాడారని గుర్తు చేశారు.

మోదీ, అమిత్ షా ప్రస్తావనే లేదు..

తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ అప్పట్లో మోదీ తెలంగాణ ఏర్పాటుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఎప్పుడూ మోదీ కానీ, అమిత్ షా కానీ తెలంగాణ ఏర్పాటు గురించి పాజిటివ్ గా మాట్లాడిన సందర్భం లేదు. కానీ తెలంగాణలో అధికారంకోసం మాత్రం బీజీపీ ఎదురు చూస్తోంది. దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న వేళ.. తాము వెనకబడిపోతామనే ఉద్దేశంతో గోల్కొండ కోటలోలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు కిషన్ రెడ్డి. సీఎం కేసీఆర్ కంటే తానే ముందు జెండా ఎగరేయాలనే ఉబలాటం మినహా.. కిషన్ రెడ్డి ప్రోగ్రామ్ లో ఎలాంటి ప్రత్యేకతా లేకపోవడం విశేషం.

ఏ ఒక్క వ్యక్తి, కుటుంబం ద్వారానో తెలంగాణ రాలేదని అన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల పోరాటంతోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందని గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పెట్టించడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది అని అన్నారాయన. ఉద్యమ నాయకుడు కేసీఆర్ గురించి కానీ, బీఆర్ఎస్ గురించి కానీ ఒక్క మంచి మాట చెప్పడానికి కూడా కిషన్ రెడ్డికి మనస్కరించకపోవడం విశేషం.

First Published:  2 Jun 2023 5:15 AM GMT
Next Story