Telugu Global
Telangana

'ఖమ్మం సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతోంది'

ఈ నెల 18 న ఖమ్మంలో జరగబోయే భారత రాష్ట్ర సమితి బహిరంసభ ఏర్పాట్ల‌ కోసం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పర్యటిస్తూ , సన్నాహక సమావేశాలు నిర్వ‌స్తున్న హరీష్ రావు ఈ రోజు సత్తుపల్లిలో జరిగిన, బీఆరెస్ నాయకుల, కార్యకర్తల‌ సమావేశంలో మాట్లాడారు.

ఖమ్మం సభ దేశ రాజకీయాలను మలుపు తిప్పబోతోంది
X

కేసీఆర్ నిర్వహించిన కరీం నగర్ సభ ఎలాగైతే తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణమయ్యిందీ 18 న ఖమ్మంలో జరగబోయే బీఆరెస్ సభ దేశరాజకీయాలను మలుపుతిప్పబోతోందని మంత్రి హరీష్ రావు అన్నారు.

ఈ నెల 18 న ఖమ్మంలో జరగబోయే భారత రాష్ట్ర సమితి బహిరంసభ ఏర్పాట్ల‌ కోసం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పర్యటిస్తూ , సన్నాహక సమావేశాలు నిర్వ‌స్తున్న హరీష్ రావు ఈ రోజు సత్తుపల్లిలో జరిగిన, బీఆరెస్ నాయకుల, కార్యకర్తల‌ సమావేశంలో మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాల వల్ల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని, రాష్ట్ర అభివృద్ది పథంలో సాగుతోందని ఆయన తెలిపారు. ఇటివంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవన్న హరీష్ రావు. పక్కనే ఉన్న ఆంధ్రాలో తెలంగాణలో ఉన్న పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

తెలంగాణలో ఉన్న రోడ్లు ఆంధ్రాలో ఉన్నాయా? తెలంగాణలో ఉన్న త్రాగునీటి సౌకర్యం ఆంధ్రాలో ఉందా? తెలంగాణలో రైతాంగానికి వచ్చే కరెంటు పక్క రాష్ట్రంలో వస్తుందా? అని హరీష్ రావు ప్రశ్నించారు.

''రైతు బంధు పథకం దేశంలో ఎక్కడా లేదు. కేంద్రం కాపీ కొట్టి పిఎం సమ్మాన్ పథకం కింద అమలు చేస్తున్నారు. రైతు భీమా పై ప్రధానమంత్రి మన అధికారులను నోట్ అడిగారు. కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు మన పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తున్నారు. మన పథకాలు దేశం అంతా ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ తరహా అభివృద్ధి చేయాలని మిగిలిన రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.దేశం మొత్తం మనవైపు చూస్తుంది. తెలంగాణలో నాట్లు వేయాలంటే చత్తీస్‌గఢ్ , ఒడిషా నుండి కూలీలు వస్తున్నారు.'' అని హరీష్ రావు పేర్కొన్నారు.

మనకు 18న ఖమ్మం సభ తరువాతే సంక్రాంతి పండుగ అని చెప్పిన హరీష్ రావు ప్రజాప్రతినిధులు కార్లను పక్కన పెట్టి ప్రజలుతో పాటు బస్సులు, లారీలలో రావాలని సూచించారు.

సిపిఎం, సిపిఐ నేతలు కూడా సభకు వస్తున్నారు కాబట్టి ఆ పార్టీ వాళ్ళను కూడా సభకు తీసుకుని రావాలని చెప్పారాయన.

ఈ సభ విజయవంతం కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావు దశా దిశ చేస్తారని హరీష్ రావు స్పష్టం చేశారు...

First Published:  13 Jan 2023 11:09 AM GMT
Next Story