Telugu Global
Telangana

తొలి కేబినెట్‌ మీటింగ్.. కీలక నిర్ణయాలు.!

ఈనెల 9న అసెంబ్లీ సమావేశం ఉంటుందని.. అదే రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు శ్రీధర్‌ బాబు. 9న సోనియా జన్మదినం సందర్భంగా రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకువస్తామన్నారు.

తొలి కేబినెట్‌ మీటింగ్.. కీలక నిర్ణయాలు.!
X

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి శ్రీధర్ బాబు ఆ వివరాలను వెల్లడించారు. కేబినెట్‌లో ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించామన్నారు. అధికారుల నుంచి వివరాలు రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. రైతులకు ఆర్థిక సాయంపైనా కేబినెట్‌లో చర్చించామన్నారు శ్రీధర్ బాబు.

ఇక 2014 నుంచి డిసెంబర్ 7 వరకు ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ విషయంలో అనేక తప్పిదాలకు పాల్పడిందని.. శుక్రవారం విద్యుత్ శాఖ‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారని చెప్పారు. డిస్కమ్‌లు దాదాపు రూ. 85 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని అధికారులు చెప్పారన్నారు శ్రీధర్ బాబు. ఇక ఇటీవల రాజీనామా చేసిన సీఎండీ ప్రభాకర్ రావు సహా ఇతర అధికారుల రాజీనామాలు ఆమోదించొద్దని అధికారులకు సీఎం సూచించారన్నారు. శుక్రవారం రివ్యూకు ప్రభాకర్‌ రావును రప్పించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారన్నారు. సోమవారం నుంచి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగేలా కుట్ర జరిగిందని అధికారులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారని శ్రీధర్ బాబు వెల్లడించారు. 24 గంటల నిరంతర విద్యుత్ కొనసాగేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

ఈనెల 9న అసెంబ్లీ సమావేశం ఉంటుందని.. అదే రోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు శ్రీధర్‌ బాబు. 9న సోనియా జన్మదినం సందర్భంగా రెండు గ్యారెంటీలు అమల్లోకి తీసుకువస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద వైద్య ఖర్చులను రూ. 10 లక్షలకు పెంచుతామని చెప్పారు. ఇక మంత్రుల శాఖల కేటాయింపుపై మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని, సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే శాఖల కేటాయింపుపై స్పష్టత వస్తుందన్నారు శ్రీధర్ బాబు.

First Published:  7 Dec 2023 5:04 PM GMT
Next Story