Telugu Global
Telangana

కేసీఆర్ వర్సెస్ రేవంత్.. ట్విట్టర్ వార్

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 మే నెలలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ ఇలాంటి నోటీస్ విడుదల చేశారని చెప్పారు.

కేసీఆర్ వర్సెస్ రేవంత్.. ట్విట్టర్ వార్
X

కేసీఆర్ ట్విట్టర్లో అడుగు పెట్టిన తర్వాత మాటల తూటాలు మరింత ఘాటుగా పేలుతున్నాయి. కేసీఆర్ ట్వీట్లకు వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అవుతున్నారు. ఆమధ్య మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో కరెంటు పోయిందని కేసీఆర్ చేసిన ట్వీట్ కి వెంటనే స్పందించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్శిటీ వ్యవహారంపై కూడా ఆయన వెంటనే స్పందించారు. కేసీఆర్ ట్వీట్ కి కౌంటర్ గా మరో ట్వీట్ పెట్టారు.


కేసీఆర్ ట్వీట్ ఏంటి..?

నీరు, విద్యుత్ కొరత కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్లను మే 1 నుంచి 31 వరకు మూసివేస్తున్నట్లు చీఫ్ వార్డెన్ పేరిట విడుదలైన నోటీసుని తన ట్వీట్ లో ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు కేసీఆర్. గత 4 నెలలుగా విద్యుత్, సాగు నీరు, తాగు నీటి సరఫరా సరిగా సాగడం లేదని, ఈ విషయంపై ప్రశ్నిస్తే తెలంగాణ ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.


రేవంత్ కౌంటర్..

కేసీఆర్ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023 మే నెలలో కూడా ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ ఇలాంటి నోటీస్ విడుదల చేశారని చెప్పారు. వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్ లు మూసివేశారన్నారు. అప్పటి నోటీసులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం తగదన్నారు రేవంత్ రెడ్డి.

First Published:  30 April 2024 5:49 AM GMT
Next Story