Telugu Global
Telangana

వర్షాన్ని లెక్కచేయకుండా నిలబడ్డ మీరు ఈ నెల 30న పోలింగ్ కి పోటెత్తాలి..

ఈ రోజు సీఎం కేసీఆర్ 4 చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. భూపాలపల్లికి చేరుకునే సరికి వర్షం జోరుగా కురుస్తోంది. జోరు వానలో కూడా ప్రజలు కేసీఆర్ ని చూసేందుకు అక్కడే ఉండిపోయారు. వర్షాన్ని లెక్కచేయకుండా తన కోసం వేచి చూస్తున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్.

వర్షాన్ని లెక్కచేయకుండా నిలబడ్డ మీరు ఈ నెల 30న పోలింగ్ కి పోటెత్తాలి..
X

భూపాలపల్లిని జిల్లా చేసింది తానేనని చెప్పారు సీఎం కేసీఆర్. మధుసూదనాచారి ఉన్నప్పుడు తాను రెండు మూడు సార్లు ఇక్కడికి వచ్చానని గుర్తు చేసుకున్నారు. భూపాలపల్లికి రావాల్సినవన్నీ వంద శాతం ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ బాధ్యత తాను తీసుకుంటానన్నారు. భూపాలపల్లిని అభివృద్ధి చేసుకున్నామని, ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు కేసీఆర్.


భూపాల‌ప‌ల్లికి ఇంజినీరింగ్ కాలేజీ తీసుకువ‌స్తామన్నారు కేసీఆర్. వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి తన వ‌ద్ద‌కు ఎప్పుడొచ్చినా నియోజ‌క‌వ‌ర్గం ప‌ని అడుగుతారని అన్నారు. ప‌ర్స‌న‌ల్ ప‌ని ఎప్పుడూ అడగలేదని చెప్పారు. సీనియ‌ర్ నాయ‌కుడు, అనుభ‌వం ఉన్న నాయ‌కుడైన వెంకట రమణారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రైతు బంధు పెంచుకోబోతున్నామని, పెన్షన్లు పెంచుకోబోతున్నామని చెప్పారు కేసీఆర్. యుద్ధం చేసేవారికే కత్తి చేతికి ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి తీసేస్తామంటున్నారని, రైతుబంధు లేకుండా చేయాలనేదే వారి ఆలోచన అని మండిపడ్డారు.

ఈ రోజు సీఎం కేసీఆర్ 4 చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొన్నారు. భూపాలపల్లికి చేరుకునే సరికి వర్షం జోరుగా కురుస్తోంది. జోరు వానలో కూడా ప్రజలు కేసీఆర్ ని చూసేందుకు అక్కడే ఉండిపోయారు. వర్షాన్ని లెక్కచేయకుండా తన కోసం వేచి చూస్తున్నందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు కేసీఆర్. ఇదే ఉత్సాహంతో ఈ నెల 30న ప్రతి ఒక్కరూ ఓటింగ్ పాల్గొనాలని అన్నారు. భూపాలపల్లిలో వర్షం కారణంగా ఆయన ఎక్కువసేపు ప్రసంగించలేదు. 10 నిమిషాల్లోనే తన ప్రసంగం ముగించారు కేసీఆర్.


First Published:  24 Nov 2023 1:29 PM GMT
Next Story