Telugu Global
Telangana

నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

2014 నాటికి నిమ్స్ లో 900 బెడ్స్ అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత వాటి సంఖ్యను 1489కి పెంచారు. కొత్త బ్లాక్ అందుబాటులోకి వస్తే బెడ్స్ సంఖ్య 2వేలకు పెరుగుతుంది.

నిమ్స్ దశాబ్ది బ్లాక్ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన
X

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో నూతన బ్లాక్‌ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. దశాబ్ది బ్లాక్‌ పేరుతో నిర్మిస్తున్న నిమ్స్‌ ఆస్పత్రి భవనాలకు భూమిపూజ నిర్వహించారు. ఈ దశాబ్ది భవనాల నిర్మాణంతో నిమ్స్‌ లో మరో 2000 పడకలు అందుబాటులోకి వస్తాయి. ఇవి అందుబాటులోకి వస్తే.. దేశంలోనే అత్యధిక సూపర్‌ స్పెషాలిటీ పడకలు ఉన్న ఆస్పత్రిగా నిమ్స్ కి ఘనత దక్కుతుంది.


తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ హయాంలో ప్రతి ఏటా నిమ్స్ ఆస్పత్రి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారు. 2014-15లో రూ.185 కోట్లు కేటాయించారు. 2022లో నిమ్స్‌ కు రూ.242 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది రూ.290 కోట్లతో విస్తరణ పనులు చేపట్టారు. 2014 నాటికి నిమ్స్ లో 900 బెడ్స్ అందుబాటులో ఉండేవి. ఆ తర్వాత వాటి సంఖ్యను 1489కి పెంచారు. కొత్త బ్లాక్ అందుబాటులోకి వస్తే బెడ్స్ సంఖ్య 2వేలకు పెరుగుతుంది.

దశాబ్ది బ్లాక్ శంకుస్థాపన అనంతరం కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ కిట్లను గర్భిణులకు అందజేశారు. గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం, రక్త హీనత లేకుండా కాపాడేందుకు ఇప్పటికే కేసీఆర్‌ కిట్‌ అందిస్తున్నారు. వీటికి అనుబంధంగా న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. గర్భవతులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, బిడ్డ పుట్టిన తర్వాత కేసీఆర్ కిట్లు అందిస్తారు. మొత్తం 8 రకాల వస్తువులు ఈ కిట్‌ లో ఉంటాయి. సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రశాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

First Published:  14 Jun 2023 7:24 AM GMT
Next Story