Telugu Global
Telangana

అడ్రస్ లేని తుమ్మల.. కేసీఆర్‌ దూరం పెట్టారా?

రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి బీఆర్ఎస్‌లో అవకాశం లేదని తుమ్మలకు అర్ధమైపోయింది. దాంతో ఆయనే భేటీకి దూరంగా ఉన్నారా లేకపోతే కేసీఆర్‌ దూరంపెట్టారా అనే విషయమై క్లారిటీ లేదు.

అడ్రస్ లేని తుమ్మల.. కేసీఆర్‌ దూరం పెట్టారా?
X

కేసీఆర్‌తో ఖమ్మం జిల్లా నేతల భేటీ జరిగింది. ఈ భేటీ చాలా కీలకమైందనే చెప్పాలి. ఎందుకంటే ఖమ్మంలో ఈనెల 18వ తేదీన భారీ బహిరంగసభ నిర్వహించాలని కేసీఆర్‌ ప్లాన్ చేశారు. ఆ బహిరంగసభ నిర్వహణ విషయమై చర్చించేందుకే భేటీ జరిగింది. పైగా ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత నిర్వహించబోతున్న మొట్టమొదటి బహిరంగసభ. అందుకనే బహిరంగసభ గ్రాండ్ సక్సెస్ కావటాన్ని కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టగా తీసుకున్నారు.

ఇందులో భాగంగానే జిల్లాకు సంబంధించిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ఇత‌ర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఇంతటి కీలకమైన సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎక్కడా కనబడలేదు. ఈ విషయంపై జిల్లాలోనే కాకుండా పార్టీలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ భేటీలో తుమ్మల పాల్గొనలేదని ఎవరు చెప్పలేదు. అయితే తనను కలిసిన వారితో కేసీఆర్‌ ఫొటోలు దిగారు.

అలాగే సమావేశంలో పాల్గొన్నవాళ్ళకి సంబంధించిన ఫొటోల్లో కూడా తుమ్మల ఎక్కడా కనబడలేదు. దీంతోనే కీలకమైన భేటీకి తుమ్మల గైర్హాజరైనట్లు అందరికీ అర్ధమైపోయింది. వివిధ కారణాలతో కేసీఆర్‌-తుమ్మల మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. ఈ నేపధ్యంలోనే తుమ్మల పార్టీ మారబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. తమ పార్టీలో చేరాలంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు తుమ్మలపై ఒత్తిడి తెస్తున్నారు. కారణాలు బయటకు చెప్పకుండానే తుమ్మల కూడా తన మద్దతుదారులతో రెగ్యులర్‌గా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

రాబోయే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుండి మళ్ళీ పోటీ చేయాలనేది తుమ్మల పట్టుదల. అయితే అందుకు అవకాశాలు లేవు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో తుమ్మలపై గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి కందాళం ఉపేంద్రరెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్‌లో ఉన్నారు. కాబట్టి తనకు టికెట్ వస్తుందో రాదో అనే అనుమానంతో ఉన్నారు. ఈ అనుమానాన్ని నిజం చేస్తూ ఈమధ్య ఇద్దరు మంత్రులు మాట్లాడుతూ.. పాలేరులో ఉపేంద్రే పోటీ చేస్తారని ప్రకటించారు. దాంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి బీఆర్ఎస్‌లో అవకాశం లేదని తుమ్మలకు అర్ధమైపోయింది. దాంతో ఆయనే భేటీకి దూరంగా ఉన్నారా లేకపోతే కేసీఆర్‌ దూరంపెట్టారా అనే విషయమై క్లారిటీ లేదు.

First Published:  10 Jan 2023 7:41 AM GMT
Next Story