Telugu Global
Telangana

చలో నల్లగొండ.. నేడు కేసీఆర్ తొలి బహిరంగ సభ

ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చాలామంది బీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా మాటల తూటాలు విసిరారు. బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడినా.. కేసీఆర్ ఎదురుదాడి ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఉంది.

చలో నల్లగొండ.. నేడు కేసీఆర్ తొలి బహిరంగ సభ
X

తెలంగాణ ఎన్నికల తర్వాత నేడు కేసీఆర్ తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నల్లగొండలో జరగబోతున్న భారీ బహిరంగ సభకు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు దాదాపు 2లక్షల మంది తరలి వస్తారని అంచనా. ఎన్నికల తర్వాత కేసీఆర్ తొలి బహిరంగ సభ కావడంతో ఈరోజు ఆయన ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ డీలా పడలేదు. హుందాగా ప్రతిపక్ష బాధ్యతను స్వీకరించి ప్రభుత్వ తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతోంది. అసెంబ్లీలో కూడా ప్రభుత్వానికి బీఆర్ఎస్ ధీటుగా సమాధానాలిస్తోంది. ఈ దశలో కృష్ణా నదీ జలాలు, ప్రాజెక్ట్ ల వ్యవహారం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. కృష్ణా ప్రాజెక్ట్ లపై కేఆర్ఎంబీకి పెత్తనం అప్పగించే విషయంలో తప్పు మీదంటే మీదంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇదే విషయంపై ఈరోజు నల్లగొండలో బీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహిస్తోంది.

ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చాలామంది బీఆర్ఎస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా మాటల తూటాలు విసిరారు. బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడినా.. కేసీఆర్ ఎదురుదాడి ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. అనారోగ్యంతో కొన్నిరోజులు మీడియాకు దూరంగా ఉన్న ఆయన.. అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాలేదు. ఇప్పుడు నేరుగా ప్రజల్లోకి వస్తున్న కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి కౌంటర్లు ఇస్తారో చూడాలి. ఈ సభ ద్వారా లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సమరశంఖం పూరించినట్టే లెక్క. కృష్ణాజలాలపై హక్కులకోసం మరోసారి ఉద్యమబాట పడుతున్న బీఆర్ఎస్ దూకుడు రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాలి.

First Published:  13 Feb 2024 2:42 AM GMT
Next Story