Telugu Global
Telangana

కేసీఆర్ ఎఫెక్ట్.. సాగునీరు విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన, కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లె వద్ద ఉన్న గాయత్రి పంప్‌హౌజ్‌లోని బాహుబలి మోటర్‌ ద్వారా లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌ నుంచి నీటిని ఎత్తిపోశారు. ఎస్సారెస్పీ వరద కాల్వలోకి నీటిని విడుదల చేశారు.

కేసీఆర్ ఎఫెక్ట్.. సాగునీరు విడుదల చేసిన కాంగ్రెస్ సర్కార్
X

యాదృచ్ఛికమో లేక ఉద్దేశపూర్వకంగా చేశారో తెలియదు కానీ, కేసీఆర్ నల్లగొండ పర్యటన తర్వాత వివిధ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ రైతులను పరామర్శించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నీళ్లున్నా కూడా సకాలంలో అందజేయడం లేదని మండిపడ్డారు. రైతులను అన్యాయం చేస్తున్నారంటూ విమర్శించారు. కాంగ్రెస్‌ చేతకానితనం, కాళేశ్వరాన్ని వాడుకోకపోవడం వల్లే భూగర్భ జలమట్టాలు పడిపోయాయని అన్నారాయన. కేసీఆర్ పర్యటన పూర్తయిన తర్వాత గంటల వ్యవధిలోనే కాళేశ్వరం మోటర్లు పనిచేయడం విశేషం.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన, కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం శ్రీరాములపల్లె వద్ద ఉన్న గాయత్రి పంప్‌హౌజ్‌లోని బాహుబలి మోటర్‌ ద్వారా లక్ష్మీపూర్‌ సర్జ్‌పూల్‌ నుంచి నీటిని ఎత్తిపోశారు. ఎస్సారెస్పీ వరద కాల్వలోకి నీటిని విడుదల చేశారు.ఇక సోమవారం సాయంత్రం 6.15 గంటలకు నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ గేట్లు తెరుచుకున్నాయి. దాదాపు వెయ్యి క్యూసెక్కుల నీటిని కాల్వలోకి వదిలారు అధికారులు. సాగర్‌ ఆయకట్టులో బోర్లలో నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఇది పెద్ద ఊరట ఇది.

నిన్న మొన్నటి వరకు సాగునీటి విడుదలలో మీనమేషాలు లెక్కపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పర్యటన తర్వాత అలర్ట్ అయింది. నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. రైతులు మొత్తుకుంటున్నా వినకుండా నీటిని విడుదల చేయని ప్రభుత్వం, కేసీఆర్ విమర్శలకు భయపడింది. మేడిగడ్డలో మూడు పిల్లర్లు కుంగితే, మొత్తం కాళేశ్వరంనే ఎండబెడుతున్నారంటూ ఆయన సూటిగా ప్రశ్నించడంతో తప్పుదిద్దుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. ఓవైపు నీటిని విడుదల చేస్తూనే, మరోవైపు కేసీఆర్ ని టార్గెట్ చేసేందుకు వరుసగా మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టారు. లోక్ సభ ఎన్నికల వేళ రైతుల్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. అయితే రైతులు మాత్రం కేసీఆర్ రాకతో తమకు నీరు వచ్చిందని సంబరపడుతున్నారు.

First Published:  2 April 2024 1:40 AM GMT
Next Story