Telugu Global
Telangana

సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా గిఫ్ట్

సింగరేణి కార్మికులకు ఆ సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దసరా లోపు ఉద్యోగులకు 368 కోట్ల రూపాయలను చెల్లించనున్నారు.

సింగరేణి కార్మికులకు కేసీఆర్ దసరా గిఫ్ట్
X

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించారు. సింగరేణి సంస్థ లాభాల్లో 30 శాతం వాటాను ఆ సంస్థ ఉద్యోగులకు చెల్లించాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

2021 -22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను దసరాలోపు సింగరేణి ఉద్యోగులందరికీ చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగరావు సింగరేణి చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు సింగరేణి సంస్థ 368 కోట్ల రూపాయలను చెల్లించనుంది.

First Published:  28 Sep 2022 9:46 AM GMT
Next Story