Telugu Global
Telangana

రేవంత్‌పై ఈడీ, ఐటీలతో విచారణ చేయండి.. మోడీని డిమాండ్ చేసిన కేసీఆర్

మహబూబాబాద్‌, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థులు మాలోత్‌ కవిత, నామా నాగేశ్వరరావులకు మద్ధతుగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు కేసీఆర్.

రేవంత్‌పై ఈడీ, ఐటీలతో విచారణ చేయండి.. మోడీని డిమాండ్ చేసిన కేసీఆర్
X

తెలంగాణలో రేవంత్‌ సర్కార్ డబుల్ "R" ట్యాక్స్ వసూలు చేస్తుందన్న మోడీ కామెంట్స్‌పై స్పందించారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. రేవంత్ సర్కార్ డబుల్‌ ఆర్ ట్యాక్స్‌ వసూలు చేసేది నిజమే అయితే వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని మోడీని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటి కాకపోతే.. ఈడీ, ఐటీలను రంగంలోకి దించి దొంగలను పట్టుకోవాలన్నారు. కానీ మోడీ ఆ పని చేయరని, పైకి నాటకాలు ఆడతారంటూ విమర్శించారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటేనన్నారు కేసీఆర్.

మహబూబాబాద్‌, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థులు మాలోత్‌ కవిత, నామా నాగేశ్వరరావులకు మద్ధతుగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందన్నారు. ఏ ఒక్క హామీని నెరవేర్చని కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు కేసీఆర్.


పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు జిల్లాలు తీసేస్తామని రేవంత్ అంటున్నారన్నారు కేసీఆర్. కొత్తగూడెంను జిల్లాగా చేసి కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్ ఇచ్చి అభివృద్ధి చేశామని కేసీఆర్ గుర్తుచేశారు. కొత్తగూడెం జిల్లాగా ఉండాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు.

First Published:  1 May 2024 3:38 AM GMT
Next Story