Telugu Global
Telangana

కేసీఆర్ బస్సుయాత్ర ఇలా.. షెడ్యూల్ ఇదే

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 3నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్రతోపాటు రోడ్‌ షోలు ఉంటాయని తెలిపారు నేతలు.

కేసీఆర్ బస్సుయాత్ర ఇలా.. షెడ్యూల్ ఇదే
X

లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు రూట్ మ్యాప్ దాదాపుగా ఖరారైంది. బస్సు యాత్రకు సంబంధించి, అనుమతులతోపాటు సెక్యూరిటీ విషయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి వివరాలు అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈనెల 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు.


బస్సు యాత్ర ఇలా..

ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 3నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసీఆర్ బస్సు యాత్రతోపాటు రోడ్‌ షోలు ఉంటాయని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. రూట్ మ్యాప్ ని ఖరారు చేసే బాధ్యతని పార్టీ నాయకులకే అప్పగించారు కేసీఆర్. దీంతో వారు కేసీఆర్ పర్యటన చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు. వాటన్నిటినీ కలుపుతూ రూట్ మ్యాప్ తయారు చేశారు.

రోడ్ షో లు.. మీటింగ్ లు..

బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ పాల్గొనే రోడ్‌షోలు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ఉంటాయని, తిరిగి సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయని తెలిపారు బీఆర్ఎస్ నేతలు. బస్సుయాత్రలు చేస్తూనే మధ్యలో బహిరంగ సభల్లో కూడా కేసీఆర్ పాల్గొంటారని చెప్పారు. సిద్దిపేట, వరంగల్‌ సహా మరికొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని బహిరంగ సభలు ఉంటాయని తెలుస్తోంది. కేసీఆర్ బస్సు యాత్రతోపాటు.. ఆయా నియోజకవర్గాల్లో నేతల ప్రచారం కూడా సమాంతరంగా జరుగుతుంది. కార్యకర్తల ఇంటింటి ప్రచారం కూడా యధావిధిగానే ఉంటుందని తెలిపారు బీఆర్ఎస్ నేతలు.

First Published:  19 April 2024 11:43 AM GMT
Next Story