Telugu Global
Telangana

కేసీఆర్ బస్సు యాత్రతో రైతులకు భరోసా..

ఆ వీడియో చూసి చలించిపోయారు కేసీఆర్. తానే స్వయంగా ఆయన్ను కలిశారు. ఆ రైతు కష్టాలను తెలుసుకున్నారు.

కేసీఆర్ బస్సు యాత్రతో రైతులకు భరోసా..
X

లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజుకి చేరుకుంది. ఈరోజు సూర్యాపేట నుంచి బయలుదేరిన కేసీఆర్ అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి చేరుకుంటారు. భువనగిరిలో బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా ఆయన రోడ్ షో నిర్వహిస్తారు. ఈరోజు యాత్రలో భాగంగా సూర్యాపేటలో ఆయన రైతులను పరామర్శించారు. వారికి భరోసా కల్పించారు


సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండా రైతు ధరావత్ నర్సింహను కలిశారు కేసీఆర్. నీరందక పూర్తిగా ఎండిపోయిన పొలంలో కిందపడిపోయి ఇటీవల రైతు నర్సింహ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి చలించిపోయారు కేసీఆర్. తానే స్వయంగా ఆయన్ను కలిశారు. ఆ రైతు కష్టాలను తెలుసుకున్నారు. 5 ఎకరాల్లో వరిపంట ఎండిపోవడంతో తాను ఆవేదన చెందినట్టు రైతు నర్సింహ తెలియజేశారు. ఆ రైతుకి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కేసీఆర్.

కేసీఆర్ ఇటీవలే రైతులకోసం యాత్ర చేపట్టారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలకోసం ఆయన ప్రచారం నిర్వహించడానికి బయటకు వచ్చారు. మే-10వ తేదీ వరకు ఆయన ఇంటికి దూరంగా ప్రజలతోనే ఉండబోతున్నారు. ఈ బస్సుయాత్ర ద్వారా ఆయన వివిధ వర్గాలను పరామర్శిస్తారు. ప్రతిరోజు సాయంత్రం రోడ్ షో లు నిర్వహిస్తారు, బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపడతారు. అయితే ఈ యాత్రకు ముఖ్యంగా రైతాంగం నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. కేసీఆర్ హయాంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ వచ్చాక ఎలా మారిపోయాయనే విషయాలను రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ బస్సుయాత్రలో వారు మమేకం అవుతున్నారు. ఆయన్ను కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

First Published:  25 April 2024 12:03 PM GMT
Next Story